టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు స్కిల్ స్కామ్ లో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ప్రస్తుత పరిణామాలు చూస్తే ఆయన ఎప్పుడు బయటకు వస్తారో చెప్పలేని పరిస్థితి. అధినేత అరెస్ట్ తోనే టీడీపీ పార్టీ సతమతమౌతుంటే లోకేశ్ చుట్టూ కూడా ఉచ్చు బిగుస్తోంది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్ స్కామ్ లో ఆ మద్య లోకేశ్ కు నోటీసులు జారీ చేసిన సీఐడీ.. నిన్నటి నుంచి ఆయనను విచారిస్తోంది. నిన్న సాయంత్రం ఐదు గంటల వరకు విచారించిన సీఐడీ.. కీలక సమాచారాన్ని సేకరించినట్లు తెలుస్తోంది. ఇక నేడు కూడా విచారణ జరుగుతోంది. దీంతో లోకేశ్ విచారణ అంశం ఎలాంటి పరిణామాలకు దారి తీస్తుందో అనే ఆందోళన పార్టీ నేతల్లో మొదలైందట. .
ఎందుకంటే చంద్రబాబు, మరియు లోకేశ్ టార్గెట్ గా వైసీపీ సర్కార్ పావులు కదుపుతోందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ నాలుగేళ్లలో బయటకు రాని స్కామ్ లు, సరిగ్గా ఎన్నికల ముందే ఎందుకు బయటకు వస్తున్నాయి ? అనే విషయాన్ని పరిశీలిస్తే.. వైఎస్ జగన్ టీడీపీ టార్గెట్ చేశారనే సంగతి స్పష్టంగా బహిర్గతం అవుతుందనేది కొందరి వాదన. ఇక లోకేశ్ లోకేశ్ విషయానికొస్తే.. గత కొన్ని రోజులుగా లోకేశ్ కూడా జైలుపాలు అవుతాడని వైసీపీ నేతలు పదే పదే చెబుతున్నారు. వారు భావించినట్టుగానే లోకేశ్ విచారణ ఏదుర్కొంటున్నారు. విచారణ పూర్తి కాగానే సీఐడీ లోకేశ్ ను కస్టడీలోకి తీసుకునే అవకాశం ఉందనేది కొందరి అభిప్రాయం. ఎందుకంటే ఆయన బయట ఉంటే సాక్ష్యాలను తారుమారు చేసే అవకాశం ఉందని సీఐడీ భావిస్తోందట. చంద్రబాబును ఎలాగైతే అదుపులోకి తీసుకున్నారో అదే విధంగా లోకేశ్ ను కూడా అదుపులోకి తీసుకోవాలనేది సీఐడీ ప్లాన్ గా తెలుస్తోంది. అదే గనుక జరిగితే టీడీపీ పరిస్థితి మరింత అస్తవ్యస్తంగా మారే ఛాన్స్ ఉంది. మరి ఏం జరుగుతుందో చూడాలి.
Also Read:గెట్ రెడీ.. జననేత జనంలోకి!