ఏపీ ఫైబర్ స్కామ్‌లో లోకేష్!

20
- Advertisement -

టీడీపీ హయాంలో జరిగిన కుంభకోణాలు ఒక్కొక్కటిగా వెలుగలోకి వస్తున్నాయి. ఇక ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంలో టీడీపీ అధినేత చంద్రబాబును అరెస్ట్ చేశారు సీఐడీ పోలీసులు. ఇక చంద్రబాబు అరెస్ట్‌ పై మీడియాతో మాట్లాడిన ఏపీ సీఐడీ చీఫ్ సంజయ్ కీలక విషయాలను వెల్లడించారు. స్కిల్ డెవలప్‌మెంట్ కుంభకోణంతో పాటు ఏపీ ఫైబర్ నెట్, అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కుంభకోణాల్లో నారా లోకేష్ పాత్ర ఉందని ఆయన్ని విచారించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ స్కామ్‌లో చంద్రబాబు ప్రధాన నిందితుడని, కుట్రదారుడన్నారని తేల్చిచెప్పారు. నకిలీ ఇన్‌వాయిస్‌ల ద్వారా షెల్‌ కంపెనీకి నిధులు మళ్లించారని..దీంతో ప్రభుత్వానికి రూ.371 కోట్లు నష్టం వచ్చింన్నారు. చంద్రబాబుకు అ‍న్ని లావాదేవీల గురించి తెలుసని.. నిధులు ఎక్కడికి మళ్లాయో చంద్రబాబును విచారించడం వల్ల బయటపడుతుందని తెలిపారు.

Also Read:చంద్రబాబు అరెస్ట్ వెనుక.. భారీ వ్యూహమా ?

న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకుని అరెస్ట్ చేశామని… ఈ ఆర్థిక కుట్రకు 10 ఏళ్లు శిక్ష పడే అవకాశం ఉందన్నారు. అన్ని విషయాలు బయటకు రావాలంటే చంద్రబాబును కస్టడీకి తీసుకుంటామని…ఇందుకు సంబంధించిన ఆధారాలన్నీ కోర్టుకు సమర్పిస్తామన్నారు. సాక్షులను ప్రభావితం చేస్తారనే చంద్రబాబును ముందస్తు అరెస్ట్ చేశామన్నారు. ముఖ్యమైన పత్రాల మాయం వెనుక చంద్రబాబు కుట్ర ఉందని.. దర్యాప్తులో మరిన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. ఈ స్కిల్‌ డెవలెప్‌మెంట్ కేసులో మాజీ మంత్రి లోకేష్‌ను కూడా ప్రశ్నిస్తామని తెలిపారు.

Also Read:Chandrababu:తప్పు చేస్తే ఉరేయండి

- Advertisement -