విజయ్ ధరణ్ దాట్ల, సిమ్రాన్ గుప్తా, అనన్య నాగళ్ల హీరో హీరోయిన్లుగా రూపొందుతోన్న చిత్రం ‘అన్వేషి’. అరుణ శ్రీ ఎంటర్‌టైన్మెంట్స్ బ్యానర్‌పై వి.జె.ఖన్నా దర్శకత్వంలో టి.గణపతి రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ మూవీని నవంబర్ రెండో వారంలో విడుదల చేయటానికి సన్నాహాలు చేస్తున్నారు. నిర్మాత గణపతి రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సోమవారం అన్వేషి మూవీ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ సందర్బంగా జరిగిన కార్యక్రమానికి నటి వరలక్ష్మి శరత్ కుమార్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈవెంట్‌లో…
యాక్టర్ నాగి మాట్లాడుతూ…మా నాన్నగారు సినిమా ప్రొడక్షన్‌లో వర్క్ చేశారు. నేను ప్రసాద్ ల్యాబ్స్‌లోనే సినిమా చూస్తూ పెరిగాను. ఇప్పుడు ఇక్కడే నేను తెరపై కనిపించటం ఎంతో హ్యాపీగా ఉంది. అవకాశం ఇచ్చిన దర్శక నిర్మాతలకు థాంక్స్. నిర్మాత గణపతి రెడ్డిగారు అన్‌కాంప్రమైజ్డ్‌గా ఈ సినిమాను నిర్మించారు. సినిమాను పెద్ద సక్సెస్ చేయాలని అందరినీ కోరుకుంటున్నాను’’ అన్నారు.
లిరిసిస్ట్ చైతన్య ప్రసాద్ మాట్లాడుతూ..ఆర్.ఎక్స్ 100 నుంచి చైతన్ భరద్వాజ్‌తో నా అనుబంధం కొనసాగుతోంది. పిల్లా రా సాంగ్ ఎంత పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమాలో మంచి పాటలు రాశాను. డైరెక్టర్ ఎంత ఇష్టపడి, కష్టపడి చేసిన సినిమా. వాళ్ల ప్యాషనేంటో నేను దగ్గర నుంచి చూశాను. సినిమా పెద్ద సక్సెస్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
కో ప్రొడ్యూసర్ హరీష్ రాజు మాట్లాడుతూ…అన్వేషి సినిమాను ఈ స్టేజ్‌కు తీసుకు రావటానికి ఎంటైర్ యూనిట్ ఎంతో కష్టపడ్డాం. ట్రైలర్ అందరికీ నచ్చే ఉంటుంది. సినిమాను ప్రేక్షకులు ఆదరించాలని కోరుకుంటున్నాను అన్నారు.కో ప్రొడ్యూసర్ శివన్ కుమార్ మాట్లాడుతూ ‘‘నేను ఐటీ బ్యాగ్రౌండ్ నుంచి సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాం. గణపతి రెడ్డిగారు మాకు వెనుకుండి నడిపించారు. టీమ్ అందరూ ఎంతో సపోర్టివ్‌గా వర్క్ చేశారు.
వరలక్ష్మి శరత్‌కుమార్ మాట్లాడుతూ ..అన్వేషి ట్రైలర్ బావుంది. విజువల్స్ చాలా బావున్నాయి. విజయ్‌కి ఆల్ ది బెస్ట్. అలాగే అనన్య, సిమ్రాన్‌లకు అభినందనలు. మ్యూజిక్, బ్యాగ్రౌండ్ స్కోర్ బావుంది. టీమ్‌కు ఆల్ ది బెస్ట్’’ అన్నారు.బసి రెడ్డి మాట్లాడుతూ ‘‘ఎంటైర్ అన్వేషి టీమ్‌కు ఆల్ ది బెస్ట్. మ్యూజిక్, విజువల్స్ అద్బుతంగా ఉన్నాయి. ట్రైలర్ కనెక్టింగ్‌గా ఉంది. కచ్చితంగా ట్రైలర్ ఆడియెన్స్‌ని థియేటర్స్‌కు రప్పిస్తుందనటంలో సందేహం లేదు. సినిమా పెద్ద సక్సెస్ కావాలని, గణపతి రెడ్డిగారు ప్రతి బర్త్ డేకు ఓ సినిమాను చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు.
Also Read:KCR:ఎన్నికల సమయంలో అపోహవద్దు