తొమ్మిది సంవత్సరాల తర్వాత ‘బాస్ ఈజ్ బ్యాక్’ అంటూ మళ్లీ సిల్వర్ స్క్రీన్ పై ఖైదీ నెంబర్ 150తో అలరించాడు మెగాస్టార్ చిరంజీవి. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రాంచరణ్ నిర్మాతగా తెరకెక్కిన ఖైదీ సంక్రాంతి బరిలో దూసుకొచ్చింది. విడుదలకు ముందే సాంగ్స్..టీజర్…ప్రీ రీలిజ్ ఫంక్షన్‌తో భారీ అంచనాల మధ్య ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది ఖైదీ నెంబర్ 150. తొమ్మిది సంవత్సరాల గ్యాప్ తర్వాత చిరంజీవి అదే రేంజ్‌లో పర్ఫామెన్స్ కనబర్చాడు.
అయితే ఖైదీనెంబర్150తో కిక్కు మీదున్న మెగాస్టార్ ప్రస్తుతం151 సినిమా ఫోకస్ పెడుతున్నారు. ఈసినిమాకు 100కోట్లు షేర్ వచ్చే సూచనలు కనిపించడంతో చిరు 151 సినిమాపై బాగానే ఫోకస్ పెట్టిన్నట్లు తెలుస్తొంది. మెగాస్టార్ తన 151 వ సినిమాకు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి కథను ఎంపిక చేసుకున్నాట్లు సమాచారం.
అయితే ఈ సినిమాకు ప్రస్తుతం హీరోయిన్‌ను వెతికే పనిలో ఉన్నారట చిరు,రాంచరణ్. ఈసినిమాలో 1850వ కాలం నాటి లుక్స్‌లో ఇమిడిపోతూ నటి కావాలి అది ఎవరకి సూట్ అవుతుందని ఆలోచించిస్తున్నారట. అయితే ఈ విషయంలో కొంతమంది అనుష్క అయితేనే కరక్ట్ అని సలహా ఇవ్వడంతో…. రాంచరణ్ అనుష్క డేట్ల కోసం ఇప్పటినుంచి కసరత్తులు మొదలుపెట్టడాని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అనుష్కను 150వ సినిమాలో తీసుకుందాం అనుకున్నప్పట్టకీ ఆసమయంలో ఆమె బహుబలి2షూటింగ్‌లో బిజీగా ఉండిపోయి ఖైదీ150 మిస్సయ్యింది.
మొత్తం మీద చిరు తన 151వ సినిమాలో అనుష్కతో రొమాన్స్ చేయనున్నడో లేదో తెలియాలంటే కొద్దిరోజులు ఆగాల్సిందే మరి. ఈ సినిమాకు కూడా రామ్ చరణ్ నిర్మాతగా వ్యవహారిస్తారంటూ ఫిల్మ్‌నగర్ వర్గాల ఇన్‌సైడ్ సమాచారం.