టీడీపీ – బీజేపీతో తెగదెంపులే…!

245
- Advertisement -

ప్రత్యేకహోదాపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఈరోజు ఉదయం మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.స్పెషల్‌స్టేటస్‌ ఆంశంపై విశాఖపట్నంలో తలపెట్టిన పోరుపై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని జనసేన అధినేతి పవన్‌కళ్యాన్‌ తీవ్రంగా తప్పుబట్టారు. శాంతి యుతంగా జరిగే నిరసన కార్యక్రమాలను అడ్డుకోవడం దారుణమని ఆయన అన్నారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజల తరపున,తన తరపున ఒక హెచ్చరిక చేస్తున్నానని పవన్‌ చెప్పారు. తెలుగుదేశం ప్రభుత్వం ఈ నిరసన కార్యక్రమాలను అడ్డుకోవడం వల్ల గోటితో పోయే దాన్ని గొడ్డలి దాక తెచ్చుకుంటుందని పవన్‌ తెలిపారు.

Why should I support TDP & BJP

తనకూ ఓ కుటుంబముందని, పిల్లలున్నారని పవన్ చెప్పుకొచ్చారు. అయినా ప్రజలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోనని పవన్ ఈ సందర్భంగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వలను హెచ్చరించారు. ఇక ప్రత్యేక హోదాకోసం జరిగే ఆందోళనను ఎవరు కూడా ఆపలేరని ఆయన వ్యాఖ్యానించారు. ప్రభుత్వం పంథానికి పోతే తాము కూడా సిద్ధమని, ఉంటే ఉంటాం…పోతే పోతాం అని పవన్‌ ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రజల కోసం సొంత అన్నయ్యతోనే, కుటుంబంతోనే విభేదించానని పవన్ మరో మారు గుర్తుచేశారు. పవన్ తన ప్రెస్‌మీట్‌లో మొత్తంగా టీడీపీ ఎంపీలపైనా, కేంద్రంపైనా మండిపడ్డారు.

వెంకయ్యనాయుడు తన కూతురికి సంబంధిచిన స్వర్ణభారతి ట్రస్ట్‌పై చూపించే శ్రధ్ధ.. ప్రత్యేక హోదా సాధనపై చూపించి ఉంటే ఈ పాటికి ఫలితాలు వచ్చి ఉండేవని పవన్‌ కల్యాణ్‌ వ్యాఖ్యానించారు.

Why should I support TDP & BJP

అయితే ఇదే ప్రెస్‌మీట్‌లో పవన్‌కళ్యాణ్‌ను విలేకరులు రాంగోపాల్‌ వర్మ ట్వీట్లపై ప్రశ్నించారు. దానికి పవన్ కల్యాణ్ ఈ విధంగా స్పందించారు. ‘‘రామ్‌గోపాల్ వర్మ గురించి ఒకటే మాట చెప్తాను. ఆయన దాదాపు 50 ఏళ్లు పైబడ్డ వ్యక్తి. ఆ మధ్యనే పెళ్లి చేసిన కూతురు. పైగా పెళ్లి అయిన కూతుర్ని పెట్టుకుని పోర్నోగ్రఫీ సినిమాలను కలెక్ట్ చేసుకుంటానని చెప్పిన వ్యక్తి మాటలపై నేను ఏం మాట్లాడగలను? ఒకరోజు నన్ను ఎత్తొచ్చు.. ఒకరోజు నన్ను తగ్గించొచ్చు. వీళ్లందరికీ సమాధానం చెప్పుకొనే స్థితిలో నేను లేను.’’అని పవన్ సమాధానమిచ్చారు.

- Advertisement -