కొన్ని కాంబినేషన్ చిత్రాలంటేనే ఆది నుంచే యమా క్రేజ్ పెరుగుతుంది. అలాగే ఆ చిత్రంపై అంచనాలూ పెరుగుతాయి. సరిగ్గా అలాంటి రేర్ కాంబినేషన్‌లో ఒక భారీ చిత్రం తెరకెక్కనుంది. ఆ సూపర్ జంటే అజిత్, అనుష్క.
అజిత్ తాజా చిత్రం ‘వివేగం’ సినిమా ఏ స్థాయిలో వసూళ్ళను కొల్లగొట్టిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వరుసగా శివ డైరెక్షన్‌లో హిట్టు మీద హిట్టు కొడ్తోన్న అజిత్, తాజాగా విశ్వాసం సినిమాతో ప్రేక్షకుల ముందుకువస్తున్నాడు. ఈ సినిమా కోసం హీరోయిన్‌గా అనుష్క పేరుని ఫైనలైజ్ చేసినట్లు తెలుస్తోంది.
గతంలో అజిత్, అనుష్క కాంబినేషన్‌లో ‘ఎంతవాడుగానీ’ పేరుతో (తమిళంలో ‘ఎన్నయ్ అరిందాల్’) ఓ సినిమా వచ్చింది. ఆ సినిమాలో త్రిష మరో హీరోయిన్‌గా నటించింది. అయితే అదొక థ్రిల్లర్ మూవీ. అజిత్ – అనుష్క మధ్య పెద్దగా కెమిస్ట్రీ వర్కవుట్ అవలేదు కూడా. కానీ ఈ సినిమాలో ఆ హద్దుని చెరిపేయనున్నారట.
ఈ సినిమా కోసం శృంగార సన్నివేశాలకు, అధర చుంబనాలకు అనుష్క పచ్చ జెండా ఊపినట్టు కోలీవుడ్ న్యూస్ హల్ చల్ చేస్తోంది. అనుష్క, అజిత్ ల మధ్య రొమాంటిక్ సీన్స్, లిప్ లాక్ కిస్సింగ్ సీన్స్ సినిమాకే హైలైట్ కానున్నాయట. మరి హుషారెక్కించే మాస్ మసాలా ఎలా ఉండబోతుందో తెలియాలంటే కొంతకాలం వేచిచూడాల్సిందే.