బాలీవుడ్ బ్యూటీ అనుష్కా శర్మ తనదైన శైలిలో దూసుకుపోతోంది. కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో కనిపించని అనుష్క..మళ్ళీ సోషల్ మీడియాలో ఎంట్రీ ఇచ్చేసింది.
ఈ మధ్యే…షారుక్ ఖాన్ రొమాన్స్ గురించి చెప్పేసి అందరి దృష్టిని ఆకర్షించేసింది. ఇక ఇదిలా ఉంటే.. తాజాగా అభద్రతాభావం గురించి చెప్పుకొచ్చింది ఈ అమ్మడు.
‘‘చిన్న వయసులో సినిమాల్లోకి వచ్చాను కాబట్టి పరిశ్రమ గురించి, చేసే పని గురించి ఎక్కువ విషయాలు తెలుసుకున్నా. అది నా కెరీర్‌కు ఎంతో ఉపయోగపడింది’’ అని చెబుతోంది బాలీవుడ్ బ్యూటీ అనుష్కా శర్మ. ఏ విషయాన్నైనా ముక్కుసూటిగా మాట్లాడే ఆమె నటీనటులకు అభద్రతాభావం ఎక్కువగా ఉందని అంటోంది. ‘‘సినిమా పరిశ్రమ అనేది అభద్రతాభావంతోనే జీవిస్తోంది. ఇక్కడ వృత్తిపరంగా ఒత్తిడి ఉండదు కానీ అభద్రతాభావం మాత్రం ఎక్కువగానే ఉంటోంది.
చాలామంది ఆ భావం కలిగించే ప్రయత్నాలు చేసి జాలి చూపిస్తున్నట్లు ప్రవర్తించి మన మీద మనకే అనుమానం కలిగేలా చేసి వాళ్లు ఆనందిస్తుంటారు. నేనైతే అదే భయం, భావనతో ఉంటున్నా. ఎట్టి పరిస్థితుల్లోనూ నా భయం ప్రభావం నటనపై పడకుండా చూసుకుంటా. విధి మన రాత మార్చగలదు కానీ ఇలాంటి భయాలు, అభద్రతాభావాలు ఏం చేయలేవని నా నమ్మకం’’ అని అనుష్కాశర్మ తెలిపింది.