అనుష్కకి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్…

211
Anushka to get Dadasaheb Phalke award In Producing Movies
- Advertisement -

బాలీవుడ్ వెండితెరపై నటిగా తనకంటూ గుర్తింపు ఏర్పర్చుకుని, మరోవైపు నిర్మాతగా మారి అత్యద్బుతమైన సినిమాలు చేస్తున్న బాలీవుడ్ బ్యూటీ అనుష్క శర్మ. ఇటీవలె భారత్ కెప్టెన్ విరాట్ కోహ్లీని వివాహం చేసుకొని ఇల్లాలిగా మారిన సంగతి తెలిసిందే. ఈ బ్యూటీ తన సోదరుడు కర్ణేష్‌ శర్మతో కలిసి నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసింది. మంచి కథలతో ప్రేక్షకులను మెప్పించదగ్గ సినిమాలు తీస్తున్న అమ్మడుకు దాదాసాహెబ్ ఫాల్కే ఫౌండేషన్ దాదా సాహెబ్ ఫాల్కే ఎక్స్ లెన్స్ అవార్డు, సత్కరించాలనుకుంటోంది.

anushka-virat

తన సోదరుడితో కలిసి నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిన అనుష్క శర్మ తొలిసారి ఎన్‌ హెచ్-10 అనే చిత్రాన్ని తెరకెక్కించారు. పాతికేళ్ల వయస్సులోనే యంగెస్ట్ ప్రొడ్యూసర్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. ఇటీవలె పరి అనే చిత్రాన్ని నిర్మించి, ఆ చిత్రంలో ప్రధాన పాత్ర పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఆ చిత్రాల ద్వారా కొత్త టాలెంట్‌ని ప్రోత్స‌హించాల‌ని అమ్మడు బావిస్తుందట‌. అనుష్క నిర్మించిన చిత్రాలన్ని క్రిటిక్స్ నుంచి మంచి అప్లాజ్ తెచ్చుకుంది. తాజాగా ఫిలౌరి అనే చిత్రం కూడా అనుష్క నిర్మాణంలోనే రూపొందుతుంది. త్వరలో మరో మూడు చిత్రాలను నిర్మించనుందట.

మరోవైపు అమ్మడు పరి చిత్రాన్ని తమిళంలో రీమేక్ చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అనుష్క పాత్రలో జ్యోతిక నటిస్తున్నట్లు సమాచారం. ప్ర‌స్తుతం ‘సూయీ ధాగా: మేడ్‌ ఇన్‌ ఇండియా’, ‘జీరో’ చిత్రాల్లో నటిస్తుంది అనుష్క‌.

- Advertisement -