నల్గొండ జిల్లా నందికొండ మున్సిపల్ చైర్మన్‌గా అనుషా శరత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి హాజరైయ్యారు. స్థానిక శాసనసభ్యులు నోముల నర్సిమయ్య తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మున్సిపల్ చైర్మన్‌గా అనుషా శరత్ రెడ్డి మాట్లాడుతూ.. పట్టణ ప్రగతిని వినియోగించుకోవాలని ప్రజలకు సూచన ఇచ్చారు. కొత్తగా మున్సిపాలిటీగా ఏర్పడ్డ నందికొండ త్వరితగతిన అభివృద్ధి చెందాలి. ఆరుదశబ్దాలుగా అభివృద్ధి కి నోచుకోని నందికొండను మున్సిపాలిటీగా ప్రకటించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ ది.
అటువంటి మున్సిపాలిటీలో ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం మేరకు అభివృద్ధి జరగాలి. పట్టణ ప్రగతిలో పేర్కొన్న ప్రాధాన్యత అంశాలను అమలు చెయ్యాలి.అటువంటప్పుడే ఈ పాలక మండలిని ప్రజలు ఎప్పటికి ఆదరిస్తారు.ప్రపంచానికి సవాలు విసురుతున్న పర్యావరణ సమస్యను అధిగమించేలా పనిచేయాలి.శ్మశాన వాటికల నిర్వహణలో శ్రద్ధ చూపాలి. డంపింగ్ యర్డలను విధిగా ఏర్పాటు చేసుకోవాలి.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వం లోని టి ఆర్ యస్ ప్రభుత్వం విధులే కాదు నిధులు విడుదల చేస్తుంది. అటు పల్లెలు ఇటు పట్టణాలలో అభివృద్ధి ని పరుగులు పెట్టించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రణాళికలు రూపొందించారు. ప్రజల్లో విశ్వసనీయత పెంపొందించేందుకు పాలక మండళ్లు పనిచేయాలని అనుషా శరత్ రెడ్డి తెలిపారు.