జనగామలో కేటీఆర్‌…ప్రజలతో మాటముచ్చట

114
ktr

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్‌ జనగామ జిల్లా కేంద్రంలో ఆకస్మికంగా పర్యటించారు. పట్టణ ప్రగతి కార్యక్రమం అమలుపై జనగామ పట్టణంలో కేటీఆర్‌ ఆకస్మికంగా పర్యటించి వివరాలు తెలుసుకున్నారు.

కేటీఆర్‌తో పాటు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు,ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి, కలెక్టర్ నిఖిలతో పాటు స్ధానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు. 13 వార్డు ధర్మకంచ బస్తీలో పర్యటించిన కేటీఆర్‌.. పారిశుద్ధ్య కార్యక్రమాలను పరిశీలించారు. పట్టణ ప్రగతిలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై స్థానిక ప్రజలతో కేటీఆర్‌ మాట్లాడారు. పట్టణంలో మరిన్ని స్వచ్ఛ వాహనాలను అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను కేటీఆర్‌ ఆదేశించారు.