తెలుగులో కుమ్మేసిన ‘నాగవల్లి’

677
Anupama Parameswaran Telugu Speech @ Shatamanam Bhavati
- Advertisement -

అనుపమ పరమేశ్వరన్… ఈ హీరోయిన్ పేరునే ఇప్పుడు టాలీవుడ్ జపం చేస్తోంది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అ…ఆ చిత్రంలో కనిపించిన ఈ భామ జాతకం ఉన్నట్లుండి చటుక్కున మారిపోయింది. ఆమెకు ఆఫర్ల మీద ఆఫర్లు వచ్చేస్తున్నాయి.మలయాళ రీమేక్‌ ‘ప్రేమమ్‌’లో నటించిన అనుపమ తాజాగా దిల్ రాజు… శతమానం భవతి ఛాన్స్ కొట్టేసింది. శరవేగంగా షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతుంది.

ఈ చిత్ర ఆడియో ఫంక్షన్‌ హైదరాబాద్‌లో ఘనంగా జరిగింది.ఈ వేడుకలో అందరినీ ఆశ్చర్యపరిచిన విషయం.. అనుపమా పరమేశ్వరన్. అందమైన హీరోయిన్ గా మాత్రమే కాదు.. తెలుగులో మాట్లాడి ఇరగదీసేసింది ఈ అమ్మాయి. సాధారణంగా టాలీవుడ్‌లో రాణిస్తున్న అగ్ర హీరోయిన్లు సైతం ముక్కున వేలేసుకునేలా తెలుగులో మాట్లాడి అబ్బురపర్చింది.

Anupama Parameswaran Telugu Speech @ Shatamanam Bhavati

‘అందరికీ నమస్కారం.. బాగున్నారా..అంటూ స్పీచ్ మొదలుపెట్టిన నాగవల్లి… ఈ రోజు నా లైఫ్ లో చాలా స్పెషల్. శతమానం భవతి లాంటి ఒక మంచి చిత్రంలో నటించినందుకు చాలా హ్యాపీగా ఉన్నాని స్పష్టంగా మాట్లాడింది. నిత్య అనే కేరక్టర్ ని చాలా ఇష్టపడి ప్రతీ నిమిషం కష్టపడి చేశానని.. నిత్యగా నన్ను ఎంచుకున్నందుకు దర్శకునికి థాంక్యూ చెప్పింది. నిఈ పాత్ర నాకు ఇచ్చినందుకే కాదు.. ఈ చిత్రం ఇంత బాగా రావడానికి ఎంతో కష్టపడ్డారు’ అంటూ తెలుగులో చెప్పుకొచ్చింది అనుపమ.

ప్రకాష్ రాజ్.. జయసుధ.. నరేష్ లాంటి ఎక్స్ పీరియన్స్ యాక్టర్స్ నటించేడం నా అదృష్టం. ఈ సినిమాకి పని చేసిన ప్రతీ ఒక్కరికీ పేరుపేరునా థ్యాంక్స్ చెబుతున్నాను. ఇక మేన్ ఆఫ్ ది డే మిక్కీ జే మేయర్.. నేను మీ పాటలతో లవ్ లో పడిపోయాను.’ అంటూ అనుపమ చెప్పింది. వీటిలో ఇంగ్లీష్ మాటల కంటే తెలుగు మాటలే.. అదికూడా పర్ఫెక్ట్ తెలుగులో ఉండడం విశేషం. ఏదైన సినీ ఫంక్షన్‌లలో వచ్చిరాని తెలుగులో మాట్లాడి విసుగుతెప్పించే హీరోయిన్లు అనుపమను నేర్చుకుంటారో లేదో చూడాలి.

https://youtu.be/hsAGBGFin9Y

- Advertisement -