20 ఏళ్ల తర్వాత కోలీవుడ్‌కి కాజోల్..

141
Kajol with Dhanush in 'VIP 2'

బాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన భామ కాజోల్. ఒకప్పుడు సినీ అభిమానుల కలల రారాణిగా ఉన్న ఈ భామ.. దక్షిణాదిలో ఒకే ఒక్క సినిమాలో నటించింది. ‘ఓ వాన పడితే ఆ కొండ కోన హాయే’ అంటూ మెరుపు కలలు సినిమాలో ఆడిపాడిన కాజోల్ తరువాత ఒక్క సౌత్ సినిమాకు కూడా అంగీకరించలేదు. డబ్బింగ్ వర్షన్గా రిలీజ్ అయిన దిల్వాలే దుల్హానియా లేజాయింగే సినిమా కూడా కాజోల్కు ఇక్కడ మంచి ఫాలోయింగ్ తెచ్చిపెట్టింది. తాజాగా ఈ బాలీవుడ్ బ్యూటీ కాజోల్ 20ఏళ్ల తర్వాత మరోసారి కోలీవుడ్‌లోకి అడుగుపెట్టేందుకు సిద్ధమైంది.

దిల్‌ వాలే సినిమాతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ను ప్రారంభించిన కాజోల్…అంత, దూకుడును చూపించకపోయినా నిదానంగా కథలను ఎంచుకుంటుంది. తాజాగా తమిళ స్టార్ ధనుష్ తాజా చిత్రం వీఐపీ-2 మూవీలో.. అమలా పాల్‌ తో పాటు కాజోల్ కూడా మెయిన్ రోల్‌లో కనిపించనుందని కోలీవుడ్ వర్గాల టాక్.

Kajol with Dhanush in 'VIP 2'

ఇప్పటికే వీరిద్దరిపై పోటో షూట్‌ కూడా జరగగా, దీన్ని సోషల్‌ మీడియాలో అభిమానులతో పంచుకుంది కాజోల్‌. వీఐపీ2 మూవీ సెకండ్ హాఫ్‌ లో కాజోల్ కనిపించనుందట. సౌందర్య రజనీకాంత్ డైరెక్షన్‌ లో వస్తున్న ఈ మూవీని ధనుష్ వండర్‌బార్ ఫిల్మ్స్ బ్యానర్‌ పై కలైపులి ఎస్ థాను నిర్మిస్తున్నారు.మూవీకి అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తున్నాడు.

20 సంవత్సరాల క్రితం ప్రభుదేవాతో ‘మెరుపు కలలు’ అనే సినిమాలో నటించిన కాజోల్‌, ఆ తరువాత ఇక్కడ ఏ భాషలలో నటించలేదు. అయితే ఇప్పుడు రెండు దశాబ్ధాల తరువాత మళ్లీ కోలీవుడ్‌ సినిమాలో నటించనుంది. ఇక ఈ చిత్ర రెగ్యులర్ షూటింగ్ జనవరి మొదటి వారం నుండి జరగనుందని సమాచారం.

Kajol with Dhanush in 'VIP 2'