నాకు రావాలనే ఉండే…

231
Anu Emmanuel Reveal The Reason For Not Attending Success Meet ...
- Advertisement -

అల్లు అర్జున్ హీరోగా అను ఇమ్మాన్యుయేల్‌ కథా నాయికగా తెరకెక్కిన సినిమా ‘నా పేరు సూర్య’. ఈ చిత్రం ద్వారా దర్శకుడిగా పరిచయమయ్యాడు వక్కంతపు వంశీ. ఇటీవలె విడుదలై ఈ సినిమా మిక్సింగ్ టాక్‌తో దూసుకెళుతుంది. వసూళ్ల పరంగా బాగానే ఉన్నాటాక్ పరంగా మాత్రం కొంచెం అటూ ఇటూగా ఉంది.

ఈ సినిమాతో బన్నీ ఓ ప్రయోగమే చేశాడని చెప్పాలి. ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించి తన నటనతో మెప్పించాడు. దర్శకుడిగా వంశీకి తొలి సినిమా కావడంతో పరవాలేదనిపించాడు. ఇక నిన్న (గురువారం) ఈ చిత్రం సక్సెస్ మీట్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు చిత్ర యూనిట్. ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిధిగా హాజరయ్యాడు పవర్ స్టార్ పవన్ కల్యాణ్.

 Anu Emmanuel Reveal The Reason For Not Attending Success Meet ...

కాగా ఈ కార్యక్రమానికి రాలేకపోయింది హీరోయిన్ అను ఇమ్మాన్యుయేల్‌. ఈ సినిమాకు సంబంధించి ప్రమోషన్‌లో కూడా ఎక్కడా కనిపించడంలేదు ఈ భామా. వరుస ఓటములతో కొట్టుమిట్టాడుతున్న ఈ అమ్మడుకు ఈ సినిమాతోనైనా విజయాన్ని అందుకోవాని ఆశించినట్టుంది. గతంలో అను నటించిన ‘కిట్టూ ఉన్నాడు జాగ్రత్త’, ‘ఆక్సిజన్’, ‘అజ్ఞాతవాసి’ వంటి చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బొక్కా బోర్ల పడ్డ విషయం తెలిసిందే.

ఇక విషయానికొస్తే ‘నా పేరు సూర్య’ సక్సెస్ మీట్‌కు రాకపోవడంపై స్పందించింది అను. వ్యక్తిగత కారణాల వల్ల హాజరుకాలేకపోతున్నాను. నాకు సక్సెస్‌మీట్‌కు రావాలని ఉంది. కానీ దురదృష్టవశాత్తు రాలేకపోతున్నాను. ఇది నాకు ప్రత్యేకమైన మూవీ, ఈ సినిమాలో నటించడం నాకెంతో సంతోషంగా ఉంది. ఈ సినిమా గురించి పనిచేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు’ అంటూ ట్వీట్‌ చేసింది ఈ బ్యూటీ.

- Advertisement -