మోడీకి చేదు అనుభవం…

274
Anti Modi protests in London
- Advertisement -

కామన్ వెల్త్ ప్రభుత్వాధినేతల సమావేశంలో పాల్గొనేందుకు లండన్‌ చేరుకున్న ప్రధానమంత్రి నరేంద్రమోడీచి చేదు అనుభవం ఎదురైంది. కతువాలో ఏనమిదేళ్ల బాలికపై అత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. నిందితులను బీజేపీ సర్కార్ కాపాడే ప్రయత్నం చేస్తుందనే ఆరోపణలు రావడంతో ప్రజలంతా బీజేపీకి వ్యతిరేకంగా నిరసన ర్యాలీలు చేపడతుండగా లండన్‌లో సైతం ఆసిఫాకు న్యాయం చేయాలని పలు హక్కుల సంఘాలు అక్కడి వీధుల్లో ఆందోళనలకు దిగాయి.

సౌత్ ఏసియా సాలిడారిటీ గ్రూప్ ఆధ్వర్యంలో వాహనాలపై పెద్దపెద్ద ఎల్‌ఇడి స్క్రీన్లను ఏర్పాటు చేసి, వాటిపై మోడీ నాట్ వెల్‌కం, జస్టిస్ ఫర్ ఆసిఫా అంటూ ప్రదర్శించాయి. థేమ్స్ తీరంలోని బ్రిటన్ పార్లమెంట్ ఎదుట, చుట్టుపక్కల వీధుల్లో ఎల్‌ఇడి స్క్రీన్లు ఉన్న వాహనాలను తిప్పారు. ఈ నేపథ్యంలో మోడీ పర్యటించే ప్రాంతాల్లో లండన్ పోలీసులు భద్రత పెంచారు.

modi london

అయితే గతంలో ఎప్పుడూ మోడీ విదేశీ పర్యటనల్లో ఇలాంటి నిరసనలు వ్యక్తం కాలేదు. ఇదిలా ఉంటే మరొకొన్ని చోట్ల మోడీ.. భారతీయు సమూహాలతో కరచాలనం చేస్తూ సందడి చేశారు.

modi

- Advertisement -