బంగ్లాలో మోదీకి నిరసనసెగ..4గురు మృతి

101
modi

రెండు రోజుల పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్‌కు చేరుకున్న ప్రధానమంత్రి మోదీకి నిరసన సెగ తగిలింది. బంగ్లాదేశ్‌కు స్వాతంత్ర్యం వచ్చి 50 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా బంగ్లాకు చేరుకున్న మోదీకి చేదు అనుభవం ఎదురైంది. మోదీ పర్యటనను వ్యతిరేకిస్తూ ప్ల కార్డులు ప్రదర్శిస్తూ నిరసన తెలిపారు. ఈ నిరసనల్లో 4 గురు మృతిచెందారు.

మరోవైపు రెండోరోజు బంగ్లాలో ప్రధాని పర్యటన కొనసాగుతోంది. ఇవాళ నైరుతి షాట్ఖిరా, గోపాల్‌గంజ్‌లోని జశోరేశ్వరి, ఓర్కాండి దేవాలయాల్లో పూజలు చేయనున్నారు. భారత్‌తో పాటు పక్కనే ఉన్న దేశాల్లోని 51 శక్తిపీఠాన్ని జశోరేశ్వరి కాళీ ఆలయాన్ని సందర్శించనున్నారు.

ఇక తొలిరోజు పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ విముక్తి పోరాటంలో తాను కూడా పాల్గొన్నానని మోదీ గుర్తుచేసుకున్నారు. బంగ్లాదేశ్ కు మద్దతుగా తాను కూడా స్నేహితులతో కలిసి సత్యాగ్రహం చేశానని…. ఆ టైంలో తనను జైల్లో పెట్టారని ఆయన వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.