ఆఫ్రికాలోని తూర్పు దేశమైన కెన్యా అంతరిక్ష రంగంలో మరో మైలురాయి సాధనలో భాగంగా వచ్చే వారం తన మొదటి ఉపగ్రహాన్ని ప్రయోగించనుందని కెన్యా ప్రభుత్వం ప్రకటించింది. దీనికి తైఫా-1 లేదా స్వాహిలిలోని నేషన్-1 ఏప్రిల్10న కాలిఫోర్నియాలోని వాండెన్‌బర్గ్ స్పేస్ ఫోర్స్ బేస్ నుండి స్పేస్ ఎక్స్ ఫాల్కన్ -9 రాకెట్‌లో ప్రయోగించనుంది. ఇది పూర్తిగా కెన్యా ఇంజినీర్లచే పూర్తిగా రూపొందించబడింది. కెన్యాలోని వ్యవసాయం మరియు ఆహార భద్రతపై డేటాను రూపొందించనుంది. బల్గేరియన్ ఏరోస్పేస్‌తో కలిసి ఉపగ్రహాల తయారీ విడిభాగాల పరీక్షలను నిర్వహించినట్టు తెలిపారు.
ఆఫ్రికా ఖండంలోనే అంతరిక్షంలోకి ఉపగ్రహాన్ని పంపిన మొదటి ఆఫ్రికన్ దేశం ఈజిప్ట్(1998)గా నిలిచింది. 2018లో మొదటి సారిగా కెన్యా అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం నుండి మొదటి నానో-ఉపగ్రహాన్ని ప్రయోగించింది. ఇప్పటివరకు 13ఆఫ్రికన్ దేశాలు కలిసి 48ఉపగ్రహాలను తయారు చేశారు. ఇందులో ఎక్కువగా అభివృద్ధి చెందుతున్న దేశాల వాటా అధికంగా ఉంది. ఇప్పటివరకు ఆఫ్రికా ఖండంలో ఏ ఒక్కటి స్పేస్ స్టేషన్ లేదు. అయితే తాజాగా జిబౌటీ ప్రభుత్వం హాంకాంగ్‌కు చెందిన కంపెనీతో $1బిలియన్ డాలర్లతో ఒక స్పేస్ పోర్ట్‌ను నిర్మించడానికి అవగాహన ఒప్పందం చేసుకున్నారు.
Kenya to launch its first operational Satellite next week
Read @ANI Story| https://t.co/038Q583sPo#Kenya #satellite pic.twitter.com/ME6or75mVA
— ANI Digital (@ani_digital) April 3, 2023
ఇవి కూడా చదవండి…