CYBERCRIME:సైబర్ మోసాలకు బలికావొద్దు..డైల్‌1930.!

41
- Advertisement -

ప్రస్తుత కాలంలో టెక్నాలజీని ఉపయోగించి సైబర్ మోసాలకు పాల్పడుతున్నట్టు నిత్యం సిటీ సైబర్ క్రైమ్‌ పోలీసులకు వేలాదిగా కంప్లైట్స్ వెళ్తున్నాయి. అయితే తాజాగా నెట్టింట్లో ఒక వీడియో తెగ వైరల్ అవుతుంది. సైబర్ క్రైమ్‌ నుంచి ఎలా తప్పించుకోవచ్చో అందులో వివరిస్తున్నారు. ఈ వీడియోలో ఎస్సై మాట్లాడుతూ… ఎవరైనా సైబర్ బాధితులు అయితే కంగారు పడకుండా తమ ఫోన్ ద్వారా 1930కి కాల్‌ చేయగానే మీ పూర్తి వివరాలతో కూడిన ఒక కోశ్చినరీ డేటాను మీ వాట్సాప్‌ నెంబర్‌కు పంపిస్తామని తెలిపారు. దాన్ని పూర్తిగా నింపి పంపినట్టియితే విత్‌ ఇన్ వన్‌ ఆవర్‌లో సంబంధిత ఆకౌంట్‌ నుండి డబ్బులు డ్రా కాకుండా ఫ్రీజ్ చేస్తామని వీడియోలో వెల్లడించారు. అంతేకాకుండా సైబర్ పోలీసులు మీ డబ్బును స్వీకరించిన వ్యక్తి యొక్క ఖాతాను ట్రేస్ చేస్తారు మరియు వెంటనే దాన్ని బ్లాక్ చేస్తారు, తద్వారా అతను డబ్బును విత్‌డ్రా చేయలేడు.

అలాగే మీ ఖాతా నుండి డబ్బులు కట్‌ అయిన తర్వాత మీ ఫోన్‌కు వచ్చే మెసేజ్‌ను సైబర్‌ క్రైమ్‌కు పంపిస్తే వారి వద్ద ఉన్న స్పెషల్ సాఫ్ట్‌వేర్‌ ప్రోగ్రాం ద్వారా ఆయా ఆకౌంట్‌ వివరాలను సేకరిస్తారు. అప్పుడు మీరు మీ డబ్బులను పొందే అవకాశం ఉంటుందని వీడియోలో పేర్కొన్నారు. ఇటువంటి వీడియో గురించి మీ స్నేహితులకు మరియు బంధువులకు తెలియజేయాలని అని సూచించారు. వీలైనంత త్వరగా అవగాహన కల్పించండి. ఆర్థిక సైబర్ నేరాల కోసం 1930కి కాల్ చేయాలని గుర్తుంచుకోవడం తప్పసరని అన్నారు. సరైన వ్యక్తికి ఫిర్యాదు చేయడంలో జాప్యం చేయడంతో డబ్బులు పోగొట్టుకున్న వారు చాలా మంది ఉన్నారు. దయచేసి మీరు సరైన వ్యక్తులకు డబ్బు పంపుతున్నారో లేదో చూసుకోవాలన్నారు. అదే సమయంలో మోసపూరిత వ్యక్తులతో మీ ఖాతా నంబర్ లేదా బ్యాంక్ వివరాలను పంచుకోవద్దని కూడా సూచించారు.

ఇవి కూడా చదవండి…

బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనాలు..

వేసవిలో ఈ వ్యాధులు అధికం.. జాగ్రత్త !

HMRL:హైదరాబాద్ వాసులకు శుభవార్త..!

- Advertisement -