నరేష్ – పవిత్ర లోకేష్ లేటు వయసులో ఘాటు ప్రేమలో పడిన సంగతి తెలిసిందే. అయితే, వీరి ప్రేమ తాలూకు వివాదం మాత్రం రోజుకో మలుపు తిరుగుతూనే ఉంది. ఇందులో భాగంగా గత కొన్ని రోజులుగా నరేష్ – పవిత్రా లోకేష్ పై సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్స్ జరుగుతున్నాయి. తమను కొంతమంది అతి దారుణంగా వేధిస్తున్నారని పలు యుట్యూబ్ చానెళ్లపై సైబర్ క్రైమ్ పోలీస్ లకు కూడా ఈ జంట ఫిర్యాదు చేసింది. మొత్తం 15 యుట్యూబ్ చానెళ్లకు నోటీసులు వెళ్లాయి. అయితే, తాజాగా నాంపల్లి కోర్టు ఆ యూట్యూబ్ చానళ్ల వ్యక్తులపై విచారణ జరపాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేసింది. నరేశ్ – పవిత్ర తమ ఫిర్యాదులో పేర్కొన్న మొత్తం 12 మందిపై విచారణ చేపట్టడానికి సైబర్ క్రైమ్ పోలీసులు సైతం రెడీ అయ్యారు.
మొత్తానికి చిన్నగా మొదలైన నరేశ్ – పవిత్ర ఫిర్యాదు వ్యవహారం ఇప్పుడు చినికి చినికి గాలి వానగా మారేలా ఉంది. ముఖ్యంగా నరేష్ తమను బాధ పెట్టిన వార పోని వదిలే ప్రసక్తే లేదని అంటున్నారు. తన మూడో భార్య రమ్య రఘుపతినే డబ్బులు ఇచ్చి తమను ట్రోల్స్ చేయించింది అనేది నరేశ్ వాదన. అయితే, ఈ ట్రోల్స్ వివాదంతో తనకు ఎలాంటి సంబంధం లేదని రమ్య రఘుపతి చెబుతుంది. కానీ, రమ్య కొన్ని యుట్యూబ్ ఛానెళ్లకు డబ్బులు ఇచ్చి.. తనను కించపరుస్తుందని పవిత్రా లోకేష్ కూడా ఆరోపిస్తోంది. మరీ చివరకు ఈ వివాదం ఎటు వైపు వెళ్తుందో చూడాలి.
ఇవి కూడా చదవండి..