ఇటివలే ఆంధ్రప్రదేశ్ లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో వైసిపి అఖండ విజయం సాధించిన సంగతి తెలిసిందే. తాజాగా ఏపీలో ఎన్నికలు మరో రికార్డును సాధించాయి. ఓకే తల్లి కడుపున పుట్టిన ముగ్గురు అన్నదమ్ముళ్లు ఒకే సారి అసెంబ్లీ లోకి అడుగుపెట్టబోతున్నారు. వీరు ముగ్గురు కూడా ఒకే పార్టీ నుంచి గెలవడం విశేషంగా చెప్పుకోవచ్చు.. ఇప్పటి వరకూ ఏపీలోనే కాకుండా దేశ చరిత్రలో కూడా ఇలా ఒకే తల్లికి పుట్టిన వాళ్లు ఒకేసారి చట్టసభల్లోకి వెళ్లడం ఇదే తొలిసారి.
కర్నూలు జిల్లా అదొని నుంచి పోటీ చేసిన ఎల్లారెడ్డి సాయి ప్రసాద్ రెడ్డి రెండో సారి విజయం సాధించారు. ఆయన సోదరుడు ఎల్లారెడ్డి బాలనాగిరెడ్డి కర్నూలు జిల్లాలోని మంత్రాలయం నియోజకవర్డం నుంచి ఈయన కూడా రెండో సారి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఇక ఆయన మరో సోదరుడు ఎల్లారెడ్డి వెంకట్రామిరెడ్డి అనంతపురం జిల్లా గుంతకల్లు నుంచి పోటీ చేసి విజయం సాధించారు. దేశ రాజకీయాల్లో వీరు మరో రికార్డు సృష్టించినట్లే అని చెప్పుకోవాలి. వీరు ముగ్గురు వైయస్సార్ సీపీ పార్టీ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచి అసెంబ్లీ లోకి అడుగుపెట్టబోతున్నారు.