జూన్ లో విశాల్ “అయోగ్య”

208
Ayogya

హీరో విశాల్ లేటెస్ట్ త‌మిళ చిత్రం `అయోగ్య`. త‌మిళంలో విడుద‌లైన ఈ చిత్రం చాలా పెద్ద విజ‌యాన్ని సాధించింది. ఇప్పుడు ఈ చిత్రాన్ని తెలుగులో కూడా`అయోగ్య‌` అనే టైటిల్‌తోనే విడుద‌ల చేస్తున్నారు. తెలుగు నిర్మాత ఠాగూర్ మ‌ధు తొలిసారి త‌మిళంలో నిర్మించిన చిత్ర‌మిది. తొలి సినిమాతో ఠాగూర్ మ‌ధు నిర్మాత‌గా భారీ విజ‌యాన్ని అందుకున్నారు.

ఈ చిత్రం తెలుగు హ‌క్కుల‌ను మ‌ల్కాపురం శివ‌కుమార్ సొంతం చేసుకున్నారు. ప్ర‌స్తుతం అనువాద కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి. జూన్‌లో సినిమాను విడుద‌ల చేసేలా స‌న్నాహాలు చేస్తున్నారు. రాశీఖ‌న్నా హీరోయిన్‌గా న‌టించింది. ఠాగూర్ మ‌ధు నిర్మంచిన ఈ చిత్రాన్ని వెంక‌ట్ మోహ‌న్ డైరెక్ట్ చేశారు. సామ్ సి.ఎస్ సంగీతం అందించారు. హీరో విశాల్ న‌ట‌నే సినిమాకు హైలైట్‌గా నిల‌చిందని త‌మిళ ప్రేక్ష‌కులు, విమ‌ర్శ‌కులు చిత్రాన్ని అప్రిషియేట్ చేశారు.