ఖుష్బూ పై ‘యానిమల్’ లవర్స్ ఫైర్

18
- Advertisement -

సీనియర్ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్బూ బ్లాక్ బాస్టర్ మూవీ ‘యానిమల్’ పై వైరల్ కామెంట్స్ చేసింది. ‘యానిమల్ మూవీ ఇంత సక్సెస్ కావడం ఇప్పటికీ నాకు ఆశ్చర్యంగానే ఉంది. ప్రజలు అసలు ఏం ఆలోచిస్తున్నారు, ఏం కోరుకుంటున్నారో అర్థం కావడం లేదు. సినీ ప్రేక్షకుల మనస్తత్వమే ఇప్పుడు సమస్య. సినిమాల్లో చూపించేవే సమాజంలో జరుగుతున్నాయి’ అని ఖుష్బూ వ్యాఖ్యానించింది. దీంతో ఖుష్బూ పై పలువురు నెటిజన్లు నెగిటివ్ కామెంట్స్ చేస్తున్నారు.

బోల్డ్ సీన్స్ పై ఖుష్బూ గారు కొత్తగా చాలా ఆవేదన చెందుతున్నారు. మరి ఆమె తన పాత సినిమాలను చూడటం లేదేమో’ అంటూ ఓ నెటిజన్.. డబ్బులు ఇస్తే.. ఖుష్బూగారు కూడా యానిమల్ చిత్రంలో నటించే వారు అంటూ మరో నెటిజన్ కామెంట్ చేశాడు. మొత్తానికి ఖుష్బూకి వ్యతిరేకంగా పోస్ట్ లు ఎక్కువ అవుతున్నాయి. అందుకు ప్రధాన కారణం.. ఖుష్బూ గతంలో చాలా బోల్డ్ సన్నివేశాల్లో నటించింది. పైగా ఆమె అప్పట్లో గ్లామరస్ పాత్రలకు కేరాఫ్ అడ్రెస్ గా ఉండేది. అలాంటి ఆమె ఇప్పుడు నీతి కబుర్లు చెబుతుంది అంటూ నెటిజన్లు సీరియస్ అవుతున్నారు.

మరోవైపు యానిమల్ చిత్రం పై నిత్యం ఎవరో ఒకరు స్పందిస్తూనే ఉన్నారు. యానిమల్ సినిమా విజయాన్ని ఆస్వాదించలేకపోయానని హీరోయిన్ రష్మిక మందన్నాకూడా తెలిపింది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ.. ‘యానిమల్ రిలీజైన మరుసటి రోజే వేరే సినిమా షూటింగ్‌లో పాల్గొన్నా. అందుకే సక్సెస్ మీట్స్, ఇంటర్య్వూలలో పాల్గొనలేకపోయా. కొన్ని ప్రతిష్ఠాత్మక చిత్రాల్లో నటిస్తున్నా. అవి ఫ్యాన్స్‌ను అలరిస్తాయి. వారు వాటిని చూస్తూ ఎంజయ్ చేసే క్షణాల కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నా’ అని చెప్పుకొచ్చారు.

Also Read:అనాసతో ఆరోగ్య ప్రయోజనాలు!

- Advertisement -