వెంకటేష్ -దిల్ రాజు..ప్రొడక్షన్ నెం 58

22
- Advertisement -

బ్లాక్‌బస్టర్ కాంబినేషన్‌ హ్యాట్రిక్ హిట్‌లను పూర్తి చేయడానికి చేతులు కలిపింది. విక్టరీ వెంకటేష్, బ్లాక్ బస్టర్ హిట్ మెషిన్ అనిల్ రావిపూడి రెండు హిలేరియస్ హిట్‌లు F2 , F3 అందించిన తర్వాత హ్యాట్రిక్ కోసం మళ్లీ జతకట్టారు. ప్రతిష్టాత్మక శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. దిల్ రాజు సమర్పణలో, శిరీష్ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ చిత్రాన్ని ఉగాది సందర్భంగా అధికారికంగా అనౌన్స్ చేశారు.

7 బ్యాక్-టు-బ్యాక్ బ్లాక్‌బస్టర్‌లను అందించిన తర్వాత అనిల్ రావిపూడి శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌లో 6వ సారి కలిసి ప్రొడక్షన్ నంబర్ 58లో అసోషియేట్ అవుతున్నారు. వీడియో ద్వారా అనౌన్స్ చేసినట్లుగా.. ఈ కొత్త చిత్రం ఒక ఎక్స్ ట్రార్డినరీ ట్రై యాంగిలర్ క్రైమ్ ఎంటర్‌టైనర్, ఇది మూడు ప్రధాన పాత్రల చుట్టూ తిరుగుతుంది- హీరో, అతని ఎక్స్ గర్ల్ ఫ్రెండ్, అతని ఎక్స్ లెంట్ వైఫ్. థీమ్ చాలా క్రేజీ అనిపిస్తుంది. మునుపెన్నడూ లేని ఎంటర్ టైన్మెంట్ కు గ్యారెంటీ ఇస్తోంది.

ఈ ముగ్గురూ ఇప్పటికే రెండు బ్లాక్‌బస్టర్‌లను అందించిన నేపథ్యంలో వీరి కాంబినేషన్‌లో మరో సినిమా కోసం సినీ అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అనిల్ రావిపూడి, SVC కూడా సూపర్ హిట్ కాంబినేషన్. ఈ అనౌన్స్ మెంట్ తెలుగు ప్రేక్షకులకు పండుగ వేడుకలను రెట్టింపు చేసింది.

హై బడ్జెట్‌తో హ్యుజ్ కాన్వాస్ పై అత్యద్భుతమైన సాంకేతిక ప్రమాణాలతో రూపొందనున్న ఈ చిత్రానికి ధమాకా కంపోజర్ భీమ్స్ సిసిరోలియో సంగీతం అందించనున్నారు.ఈ చిత్రానికి సంబంధించిన మరిన్ని ఆసక్తికరమైన వివరాలు త్వరలో తెలియజేస్తారు. 2025 సంక్రాంతికి ఈ చిత్రాన్ని విడుదల చేస్తామని మేకర్స్ అనౌన్స్ చేశారు.

Also Read:అభిషేక్ నామా… ‘నాగబంధం’

- Advertisement -