ఏపీకి ప్రత్యేక హోదా.. నో ఛాన్స్!

465
- Advertisement -

ఏపీ రాజకీయాలు ఎప్పుడు తెరపైకి వచ్చిన ప్రత్యేక హోదా అంశం కచ్చితంగా ప్రస్తావనకు వస్తుంది. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయిన తరువాత విభజన హామీలలో భాగంగా ఆర్థికంగా వెనుకబడిన ఆంధ్రప్రదేశ్ కు స్పెషల్ స్టేటస్ ఇస్తామని అప్పటి యూపీఏ ప్రభుత్వం హామీ ఇచ్చింది. ఆ హామీని అప్పటికి ప్రతిపక్ష పార్టీ అయిన కేంద్ర బీజేపీ కూడా గట్టిగానే సమర్థించింది. కానీ ఊహించని విధంగా 2014 ఎన్నికల్లో యూపీఏ ప్రభుత్వం పోయి ఎన్డీయే ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. దీంతో ఏపీ స్పెషల్ స్టేటస్ అంశాన్ని మోడి సర్కార్ ఎప్పటికప్పుడు దాటవేస్తూ వచ్చింది. ఇక ఏపీ నేతలు కూడా సమయం వచ్చినప్పుడల్లా కేంద్రం వద్ద స్పెషల్ స్టేటస్ అంశాన్ని తెరపైకి తెస్తూనే ఉంది. అయితే కేంద్రప్రభుత్వం మాత్రం చూసి చూడనట్లుగా దాటవేసే దొరణినే అవలంబిస్తూ వచ్చింది.

అయితే స్పెషల్ స్టేటస్ పై గళం పెరుగుతున్న క్రమంలో ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చే ప్రసక్తే లేదని, అలాంటి ప్రతిపాదనే లేదని కేంద్ర ప్రభుత్వం ఆ మద్య బాంబ్ పెల్చింది. దీంతో ఎన్నో రోజులుగా స్పెషల్ స్టేటస్ కోసం ఎదురు చూస్తున్న ఏపీ ప్రజల ఆశలపై నీళ్ళు చల్లింది కేంద్రప్రభుత్వం. ఇక తాము అధికారంలోకి వస్తే కేంద్రం మేడలు వంచైనా స్పెషల్ స్టేటస్ తీసుకొస్తామని హామీ ఇచ్చిన వైఎస్ జగన్.. తీర అధికారంలోకి వచ్చిన తరువాత ఏదో హామీ ఇచ్చినందుకు నామమాత్రంగా కేంద్రం వద్ద ప్రతిపాదన ఉంచుతున్నారే తప్పా.. కచ్చితంగా ప్రత్యేక హోదా సాధించే విధంగా జగన్ పోరాటం లేదనేది ప్రజల నుంచి వినిపిస్తున్న మాట.

ఈ నేపథ్యంలో అసలు స్పెషల్ స్టేటస్ ఇచ్చే ప్రసక్తే లేదని కేంద్రం తేల్చి చెప్పడంతో.. ఇక వైసీపీ ప్రభుత్వం కూడా ఈ ప్రతిపాదనను అడగడమే మానేసింది. ఇక ప్రజలు కూడా హోదాపై ఆశలు వదిలేసుకున్న పరిస్థితి. ఇక తాజాగా మరోసారి కేంద్రం గత నిర్ణయానికే కట్టుబడి ఉంటూ మరోసారి ప్రత్యేక హోదాపై పాత మాటే వినిపించింది. ఇటీవల రాజ్యసభలో వైసీపీ ఎంపీ సుభాష్ చంద్రబోస్ ప్రత్యేక హోదాపై మరోసారి కేంద్రాన్ని ప్రశ్నించగా ఏపీకి ప్రత్యేక హోదా ఇచ్చే ప్రసక్తే లేదని, అసలు ఏ రాష్ట్రనికి కూడా హోదా లేదని కేంద్ర మంత్రి ఇంద్ర జిత్ సింగ్ లిఖితపూర్వకంగా సమాధానం ఇచ్చారు.

వివిద కారణాలు, అప్పటి పరిస్థితుల కారణంగా గతంలో కొన్ని రాష్ట్రాలకు ప్రత్యేక హోదా కల్పించారని, కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదని ఆయన చెప్పుకొచ్చారు. నిధుల పంపిణీ ద్వారా ప్రతి రాష్ట్రనికి సమృద్ది గా కేంద్రం వనరులు సమకూరుస్తోందని, రెవెన్యూ లోటు ఉన్న రాష్ట్రాలకు ప్రత్యేకంగా గ్రాంట్ల రూపంలో నిధులు విడుదల చేస్తున్నట్లు ఇంద్రజిత్ సింగ్ చెప్పుకొచ్చారు. ఆయన చేసిన వ్యాఖ్యలను బట్టి చూస్తే ఏపీకి ప్రత్యేక హోదా అంశం పూర్తిగా సమసిపోయిన అధ్యాయం అనే విషయం స్పశ్తమౌతోంది. అయితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ గెలిస్తే ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఇటీవల జోడో యాత్రలో భాగంగా రాహుల్ గాంధీ ఏపీలో పర్యటించినప్పుడు వ్యాఖ్యానించారు. మరి హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ అయిన అధికారంలోకి వస్తే ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందో లేదో చూడాలి.

ఇవి కూడా చదవండి…

తెలుగువాళ్ళంటే కేంద్రానికి ఇంత చిన్నచూపా ?

బీజేపీ అక్రమ పరిపాలనకు ఇదే నిదర్శనం!

చైనా ఉచ్చులో.. 82దేశాలు విలవిల

- Advertisement -