నేటి నుంచి ఆంధ్రా బ్యాంక్‌ కాదు యూబీఐ!

429
andhrabank
- Advertisement -

దేశంలో బ్యాంకుల విలీన ప్రక్రియకు మరో ముందడుగు పడింది. మరో 10 బ్యాంకుల విలీనానికి రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా అమోదం తెలపడంతో నేటి నుంచి బ్యాంకుల విలీనం అమలులోకి రానుంది.

ఓరియెంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్, యునైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ బ్రాంచులు పీఎన్‌బీ బ్రాంచులుగా పనిచేస్తాయి. సిండికేట్ బ్యాంక్ బ్రాంచులు కెనరా బ్యాంక్ బ్రాంచులుగా మారతాయి. ఆంధ్రా బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్ బ్రాంచులు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్రాంచులుగా రూపాంతరం చెందుతాయి. అలాగే అలహాబాద్ బ్యాంక్ బ్రాంచులు ఇండియన్ బ్యాంక్ బ్రాంచులుగా పనిచేస్తాయి.

విలీనం తర్వాత దేశంలో ప్రభుత్వ రంగానికి సంబంధించి 7 పెద్ద బ్యాంకులు, 5 చిన్న బ్యాంకులు మాత్రమే మిగులుతాయి. 2017లో దాదాపు 27 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఉండేవి. విలీనం తర్వాత ఎస్‌బీఐ అతిపెద్ద బ్యాంకుగా అవతరించగా పంజాబ్ నేషనల్ బ్యాంక్ రెండో అతిపెద్ద బ్యాంక్‌గా ,బ్యాంక్ ఆఫ్ బరోడా (బీఓబీ) మూడో అతిపెద్ద బ్యాంక్ అవుతుంది. దీని తర్వాతి స్థానంలో కెనరా బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ బ్యాంక్ ఉన్నాయి.

- Advertisement -