బ్యాంక్ అకౌంట్ లేకపోయినా రూ.2వేలు మార్చుకోవచ్చు

39
- Advertisement -

బ్యాంకులో ఖాతా లేకపోయినా రూ.20,000 వరకు రూ.2,000 నోట్లను మార్పిడి చేసుకోవచ్చని స్పష్టం చేసింది ఆర్బీఐ. సోషల్ మీడియాలో రూ.2వేల నోట్ల మార్పుపై జరుగుతున్న ప్రచారాన్ని ఖండించింది ఆర్బీఐ. రూ.2,000 నోట్ల మార్పిడి కోసం ఎలాంటి ఐడీ ఫ్రూఫ్‌ అవసరం లేదని తెలిపింది. అలాగే ఏ విధమైన ఫార్మ్‌ లేదా స్లిప్‌ పూరించాల్సిన పని లేదని ఆదివారం పేర్కొంది.

ఎలాంటి గుర్తింపు కార్డు లేదా ఫార్మ్‌ లేకుండా రూ.20,000 వరకు రూ.2,000 నోట్లను బ్యాంకు ఖాతాలో డిపాజిట్‌ చేయవచ్చని పేర్కొంది. ఆర్బీఐకి చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాలతోపాటు ఇతర బ్యాంకులు రూ.2,000 నోట్లను ఈ నెల 23 నుంచి స్వీకరిస్తాయని పేర్కొంది. ఈ ఏడాది సెప్టెంబర్‌ 30 వరకు ఈ నోట్లను మార్పిడి లేదా డిపాజిట్‌ చేసుకోవచ్చని తెలిపింది.

Also Read:సుంగంధాల రారాజు…లవంగం

క్లీన్ నోట్ పాలసీ కింద రూ.2,000 నోట్ల చెలామణిని నిలిపివేస్తున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది.

- Advertisement -