ప్రస్తుతం దేశంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. గత ఎనిమిదేళ్లుగా ప్రధానిగా నరేంద్ర మోడీ తనదైన రీతిలో పరిపాలన సాగిస్తున్నారు. అయితే గత రెండు సార్లు దేశ ప్రజలు బీజేపీకి తిరుగులేని విజయాన్ని కట్టబెట్టడానికి మోడీయే ప్రధాన కారణం అని చెప్పక తప్పదు. 2014 ఎన్నికల ముందు మోడీ మేనియా ఏ స్థాయిలో నడిచిందో అందరం చూశాం. ఇక ప్రధానిగా భాద్యతలు చేపట్టిన తరువాత మోడీ కూడా తనదైన మార్క్ చూపించారు. రహదారుల అభివృద్ది, పేదరిక నిర్మూలన, మౌలిక సదుపాయాలు, సాంఘిక సంక్షేమం.. ఇలా చాలా వాటిలో తనదైన పరిపాలనను ప్రజలకు పరిచయం చేశారు.
ఇక 370 ఆర్టికల్ రద్దు వంటి సున్నితమైన వాటిపై కూడా సాహసోపేత నిర్ణయాలు తీసుకొని తన మార్క్ చూపించారు. మోడీ తీసుకున్న ఈ నిర్ణయాలే 2019 ఎన్నికల్లో తిరిగి అధికారాన్ని కట్టపెట్టాయి. అయితే మోడీ పాలనపై సానుకూలతతో పాటు వ్యతిరేకత కూడా పెరుగుతూ వచ్చింది. ముఖ్యంగా నోట్ల రద్దు విషయం ప్రజలు ఎదుర్కొన్న ఇబ్బందులు, జిఎస్టీ వంటి అదనపు పన్నులు, పెట్రోల్ డీజిల్ ధరల పెంపు.. ఇలా అంశాలే మోడీ పాలనపై వ్యతిరేకత చూపిస్తున్నాయి. ఇవే కాకుండా బీజేపీ హయంలో మతపరమైన ఘర్షణలు పెరగడం, ప్రశ్నించే వారిపై కేసులు మోపడం వంటి చర్యలతో మోడీ నియంత పాలన అనే విధంగా ప్రజల్లో అభిప్రాయం ఏర్పడుతోంది.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో దేశ ప్రజలు ఎలాంటి తీర్పు ఇవ్వబోతున్నారనేది ఆసక్తికర విషయమే.. అయితే వచ్చే ఎన్నికల్లో మోడీని అయితే విపక్షాలన్నీ ఏకమైతే వచ్చే ఎన్నికల్లో మోడీని గద్దె దించడం ఖాయమని కాంగ్రెస్ నేత శశిథారూర్ వ్యాఖ్యానించారు. ప్రతి నియోజికవర్గంలోనూ విపక్షాలన్నీ కలిసి ఉమ్మడి అభ్యర్థిని నిలబెడితే బీజేపీకి గట్టి పోటీ ఇచ్చే అవకాశం ఉందని ఆయన చెప్పుకొచ్చారు. గత ఎన్నికల్లో విపక్షాల మద్య సమన్వయం లేకపోవడం వల్లే బీజేపీ గెలిచిందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే ఈసారి జాతీయ రాజకీయాల్లో చాలానే మార్పులు జరిగే అవకాశం ఉంది.. మోడీని ఎదుర్కొనేందుకు అన్నీ పార్టీలు ఏకమైనా ఆశ్చర్యం లేదు. ఒకవేళ ఆదే గనుక జరిగితే.. మోడీకి షాక్ తప్పదని కొందరి అభిప్రాయం. మరి దేశ ప్రజలు వచ్చే ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో మరి.
ఇవి కూడా చదవండి…