జగన్ గురి.. ఆ మంత్రులపైనే ?

42
jagan
- Advertisement -

గత కొన్నిరోజులుగా ఏపీలో అధికార వైసీపీ తరచూ వార్తల్లో నిలుస్తోంది. సొంత ఎమ్మెల్యేలు పార్టీ పై తిగుగూబాటు గళం వినిపించడం.. ఫోన్ ట్యాపింగ్ వంటి సమస్యలు తెరపైకి రావడం.. అదే సమయంలో ఆయా వైసీపీ నేతల వ్యవహార శైలిపై ప్రజల నుంచి కూడా విమర్శలు వస్తుండడం.. ఇలా చాలా సమస్యలే వైసీపీని చుట్టూ ముట్టాయి. అయితే పరిస్థితి ఇలాగే కొనసాగితే వచ్చే ఎన్నికల్లో వైసీపీ దారుణంగా నష్టపోయే అవకాశం ఉందని భావించిన వైఎస్ జగన్.. పార్టీపై అలాగే తన క్యాబినెట్ మంత్రులపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. వచ్చే ఎన్నికల్లో 175 స్థానాల్లోనూ విజయం సాధించాలని టార్గెట్ పెట్టుకున్నజగన్.. ” గడప గడపకు మన ప్రభుత్వం :” కార్యక్రమంతో ఎమ్మెల్యేలను, మంత్రులను, పార్టీ నేతలను నిత్యం ప్రజల్లో ఉంచుతున్నారు.

అయితే పలువురు నేతలు, ఎమ్మేల్యేలు ” గడపగడపకు మన ప్రభుత్వం ” కార్యక్రమంపై నిర్లక్ష్యం వహిస్తుండడంతో వారిని జగన్ మందలించిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు సి‌ఎం జగన్ మంత్రులపై ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ప్రజల్లో యాక్టివ్ గా లేని.. విమర్శలు ఎదుర్కొంటున్న 5గురు మంత్రులపై సి‌ఎం జగన్ వేటు వేయబోతున్నట్లు మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. ఇప్పటికే అధికారం చేపట్టిన తరువాత రెండు సార్లు మంత్రివర్గంలో మార్పులు చేసిన జగన్.. ఇప్పుడు ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ఆయా మంత్రులపై ఏర్పడుతున్న వ్యతిరేకత వచ్చే ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉందనే భావనతో అయిదుగురు మంత్రులను తప్పించి వారి స్థానంలో ఇతరులకు అవకాశం కల్పించనున్నారట.

అయితే ఆ అయిదుగురు మంత్రులు ఎవరనే దానిపై ఎలాంటి స్పష్టత లేదు. అయితే పోలిటికల్‌ సర్కిల్స్ లో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం.. గుడివాడ అమర్నాథ్, ఆర్కే రోజా వంటి వాళ్ళతో పాటు మరో ముగ్గురు ఉన్నారట. ఈ మద్యకాలంలో గుడివాడ అమర్నాథ్, మరియు రోజాలపై వచ్చినన్ని విమర్శలు ఏ రాజకీయ నాయకుడిపై రాలేదనే చెప్పాలి. ఐటీ విషయంలో అమర్నాథ్ పై ఇప్పటికీ కూడా సోషల్ మీడియాలో ట్రోల్స్ వస్తూనే ఉన్నాయి. ఇక రోజా కూడా తరచూ విమర్శలపాలు అవుతూనే ఉంది. ఈ నేపథ్యంలో ఈ ఇద్దరి మంత్రులపై వేటు తప్పదనే చర్చ జోరుగా సాగుతోంది. మరి నిజంగానే సి‌ఎం జగన్ అయిదుగురు మంత్రులపై వేటు వేయనున్నారా ? లేదా ఇవన్నీ వైరల్ అవుతున్న వార్తలేనా ? అనేది తెలియాలి.

ఇవి కూడా చదవండి…

లోకేశ్ యువగళం.. జోష్ నిల్ ?

సీఎం బర్త్ డే..కీసరలో గ్రీన్ ఛాలెంజ్

కాంగ్రెస్‌తో పొత్తా.. ఛాన్సే లేదు!

- Advertisement -