పాతికేళ్ల అంధ‌గాడు..

192
'Anddhagadu' team announces Release date
'Anddhagadu' team announces Release date
- Advertisement -

మ‌ల్టీ టాలెంటెడ్, ఎన‌ర్జిటిక్ యాక్ట‌ర్ రాజ్‌త‌రుణ్ పుట్టిన‌రోజు నేడే(మే 11). ఇప్పుడు రాజ్‌త‌రుణ్ `అంధ‌గాడు`గా ప్రేక్ష‌కుల‌ను అల‌రించ‌డానికి సిద్ధ‌మ‌య్యారు. ఏ టీవీ స‌మ‌ర్ప‌ణ‌లో ప్ర‌ముఖ నిర్మాణ సంస్థ ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్స్ ఇండియా ప్రై.లి. బ్యాన‌ర్‌లో రాజ్‌త‌రుణ్ హీరోగా ఈడోర‌కం-ఆడోర‌కం, కిట్టు ఉన్నాడు జాగ్ర‌త్త వంటి సూప‌ర్‌హిట్ చిత్రాలు త‌ర్వాత రూపొందుతోన్న హ్యాట్రిక్ మూవీ `అంధ‌గాడు`

ప్ర‌ముఖ ర‌చ‌యిత వెలిగొండ శ్రీనివాస్ ద‌ర్శ‌కుడిగా ప‌రిచ‌యం అవుతున్న ఈచిత్రాన్ని రామ‌బ్ర‌హ్మం సుంక‌ర నిర్మిస్తున్నారు. ఈడోర‌కం-ఆడోర‌కం, కుమారి 21ఎఫ్ వంటి హిట్ చిత్రాలు త‌ర్వాత రాజ్‌త‌రుణ్‌, హెబ్బాపటేల్ హిట్ కాంబినేష‌న్‌లో రిపీట్ అవుతుంది. . రాజ్‌త‌రుణ్‌కు పుట్టిన‌రోజు శుభాకాంక్ష‌ల‌ను తెలియ‌జేస్తూ `అంధ‌గాడు` మూవీ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. భ‌విష్య‌త్‌లో ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌లో అసోసియేట్ కానున్నారు.

డిఫ‌రెంట్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న ఈ చిత్రం ఎ.కె.ఎంట‌ర్‌టైన్మెంట్ బ్యాన‌ర్‌లో రాజ్‌త‌రుణ్‌కు హ్యాట్రిక్ హిట్ మూవీ అవుతుంది. రాజ్‌త‌రుణ్ పుట్టిన‌రోజు సంద‌ర్భంగా `దెబ్బ‌కు పోయే పోయే..` అనే సాంగ్ టీజ‌ర్‌ను విడుద‌ల చేశారు. ఈ సాంగ్ టీజ‌ర్‌కు ప్రేక్ష‌కుల నుండి మంచి స్పంద‌న‌ను రాబ‌ట్టుకుంది. త్వ‌ర‌లోనే ఈ సినిమాకు సంబంధించిన మిగిలిన సాంగ్స్‌ను సోష‌ల్ మీడియా, ఎఫ్‌.ఎం. రేడియో స్టేష‌న్స్‌లో విడుద‌ల చేయ‌నున్నారు. త్వ‌ర‌లోనే థియేట్రిక‌ల్ ట్రైల‌ర్ విడుద‌ల చేసి, ప్రీ రిలీజ్ ఫంక్ష‌ను నిర్వ‌హించి జూన్ 2న సినిమాను ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌ల చేస్తున్నారు.

- Advertisement -