స్టాప్‌ ను తోసేసిన యాంకర్‌ సుమ…

29
- Advertisement -

యాంకర్ సుమ… వినోదరంగంలో ‎టాప్‌ యాంకర్‌ ‎ఎవరు ‎అనగానే ‎మనకు టక్కున ‎గుర్తొచ్చే పేరు యాంకర్‌ సుమ కనకాల. ‎తనదైన ‎చలాకితనం.. ‎వాక్చాతుర్యంతో ‎ప్రేక్షకుల ‎హృదయాల్లో ‎చెరగని ‎ముద్రవేసుకున్న ఈ స్టార్‌ మహిళ ‎అటు ‎బుల్లితెరమీదే కాదు.. ‎ఇటు ‎సోషల్‌ మీడియాలో సైతం ‎నిత్యం ‎చురుకుగా ‎ఉంటారన్న సంగతి తెలిసిందే. సోషల్‌ మీడియా వేదికగా ఈ స్టార్‌ యాంకర్‌ తనతో పాటు… తన స్టాప్‌ ను కూడా పలు సందర్భాల్లో జనానికి పరిచయం చేసిన విషయం తెలిసిందే.. అయితే తాజాగా యాంకర్‌ సుమ తన స్టాప్‌ తో సోషల్‌ మీడియా వేదికగా చేసిన ఓ రీల్‌ ఇప్పుడు తెగ వైరల్‌ అవుతోంది. నిత్యం తన స్టాప్‌ తో సరదగా గడిపే సుమ ఒక్కసారిగా వారిని తోసేస్తున్నట్లుగా ఉన్న ఈ వీడియో చూస్తే.. సుమలో ఈ కోణం కూడా ఉందా అని ఆశ్చర్యపోవడం ఖాయం.

సోషల్‌ మీడియా ఫ్లాట్‌ పాం ఇన్ స్టాలో సుమ చేసే రీల్ వీడియోలు ఎంతో వినోదాత్మకంగా ఉంటుండటంతో అవి ఎక్కువగా వైరల్ అవుతాయి. తాజాగా సుమ తన స్టాప్‌ తో చేసిన ఓ వీడియో ఇప్పుడు ట్రెండింగ్‌ లో ఉందనే చెప్పాలి. సుమ చేసిన ఈ రీల్ వీడియో మరింత ఫన్నీగా ఉంది. ఎంతో డెడికేషన్ ఉన్న టీం ఉంటే ఎలా ఉంటుందో ఫన్నీగా చూపించింది. లీవ్ మీ ఎలోన్ అంటూ సాగుతున్న ట్రెండింగ్ వీడియోకు సుమ తాజాగా రీల్స్ చేసింది. ఇందులో తన టీం మెంబర్లంతా కూడా తనని వదలకుండా పనులు చేస్తున్నారన్నట్టుగా చూపించింది. నన్ను ఒంటరిగా వదిలేయండి అంటూ.. అందరినీ తోసి అవతలకు నెట్టేసింది సుమ. అయితే ఈ వీడియో చూసిన వారంతా చాలా సాప్ట్‌ గా కనిపించే సుమలో.. వామ్మో.. ఇంత వాయిలెంట్‌ కూడా ఉందా అంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. ఇక మరికొందరైతే.. సుమను అందంగా చూపించే తన స్టాప్‌ పై మరీ అలా అరవడమేంటి.. తన కోసమే కదా వారు పనిచేస్తుందని కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా.. ఆన్‌ స్క్రీన్‌ లో కనిపించే సుమకు.. ఆప్‌ స్క్రీన్‌ లో కనిపించే సుమకు చాలా తేడా ఉంది అంటూ మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.

- Advertisement -