- Advertisement -
బుల్లితెరపై యాంకరింగ్ చేస్తు తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శ్రీముఖి. ప్రస్తుతం టాలీవుడ్ టాప్ యాంకర్స్ లో శ్రీముఖి కొనసాగుతుంది. పటాస్ కామెడీ షో ద్వారా ఫేమస్ అయిన శ్రీముఖి ప్రస్తుతం మా టీవీలో స్టార్ మ్యూజిక్ రీలోడెడ్ లో చేస్తుంది. ఇక ఇటివలే బిగ్ బాస్ షో లో పాల్గోన్న శ్రీముఖి రన్నరప్ గా నిలిచింది. తాజాగా శ్రీముఖి ఇన్ స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో చాట్ చేసింది.
ఈసందర్భంగా అభిమానులు శ్రీముఖిని పలు ఆసక్తికరమైన ప్రశ్నలు అడిగారు. ఎవరైనా మీకు ముద్దు పెడతానంటే వద్దని చెప్పావా అని అడగ్గా..అవును నన్ను ముద్దు పెడతా అని అడిగారు కానీ నేనే వద్దని చెప్పాను అని సమాధానం ఇచ్చింది. తాను ఒక వ్యక్తితో ప్రేమలో ఉన్నానని అతను మా కుటుంబ సభ్యులకు కూడా తెలుసని చెప్పింది. అవసరం వచ్చినప్పుడు మా తల్లితండ్రులకు అబద్దాలు చెబుతానని తెలిపింది.
- Advertisement -