వీ6 ఛానల్‌కు చెందిన ప్రముఖ యాంకర్ రాధిక ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. నిన్న రాత్రి 10.30 గంటల సమయంలో అపార్ట్ మెంట్‌పై నుంచి దూకి బలవర్మణానికి పాల్పడింది. ఈ నేపథ్యంలో టీవీ యాంకర్ రష్మి గౌతమ్ ట్విట్టర్ ద్వారా స్పందించింది. ఆత్మహత్యే అన్ని సమస్యలకు పరిష్కారం కాదని తెలిపింది. రాధిక ఆత్మకు శాంతి కలగాలని ట్వీట్ చేసింది.
ఆత్మహత్యతో మన జీవితాన్ని బాగుచేసుకునే అవకాశం కోల్పోతామని తెలిపింది. సైకియాట్రిస్ట్ వద్దకు వెళ్లినంత మాత్రాన మనం పిచ్చివాళ్లమైట్లు కాదు. మానసిక ఒత్తిడి గురించి ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని… ఇలాంటి సందర్భాల్లో స్నేహితులతో, కుటుంబీకులతో మన బాధలు పంచుకోవడం ఉత్తమమని.. లేవగానే ఇలాంటి వార్తలు వినడం నచ్చదని తెలిపింది.
హైదరాబాద్‌లోని మూసాపేట గూడ్స్‌షెడ్ రోడ్డులోని సువీలా అపార్ట్‌మెంట్‌లో ఉంటోంది రాధిక. ఐదేళ్లుగా ఇక్కడే ఉంటున్న ఆమె ఆర్నెల్ల కిందట భర్తతో విడాకులు తీసుకుంది.ప్రస్తుతం తండ్రి, చెల్లెలు, కుమారుడితో కలిసి ఉంటున్నారు. రాత్రి ఆఫీసు నుంచి వచ్చిన రాధిక…భవనం పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది. నా చావుకు ఎవరూ కారణం కాదు.. నా మెదడే నా శత్రువు.. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నాను..అంటూ సూసైడ్ నోట్ రాసింది.
"Suicide does not end the chances of life getting worse, suicide eliminates the possibility of it ever getting better." Never met her but I truly hope she found peace. https://t.co/uNQAg1p5tF
— rashmi gautam (@rashmigautam27) April 2, 2018