బుల్లితెరపై ప్రసారమయ్యే రియాలిటీ షో బిగ్ బాస్ తెలుగులో విజయవంతంగా రెండు సీజన్లు పూర్తి చేసుకుంది. త్వరలోనే మూడవ సీజన్ కూడా ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను పూర్తీ చేశారు నిర్వాహకులు. ఇందుకు సంబంధించి బిగ్ బాస్ 3 టీజర్ ను కూడా విడుదల చేశారు.
ఈసారి హోస్ట్ గా నాగార్జున వ్యవహరించనున్నాడని టీజర్ చూస్తే అర్ధమైపోతుంది. తొలి సీజన్ కు ఎన్టీఆర్ వ్యాఖ్యతగా వ్యవహరించగా, రెండవ సీజన్ కు నాని యాంకర్ గా చేశారు. ఇక మూడవ సీజన్ కు నాగార్జున వ్యాఖ్యతగా వ్యవహారించడంతో ఈషో పై భారీగా అంచనాలున్నాయి.
జులై మొదటి వారంలో ఈషో ప్రారంభం కానున్నట్లు తెలుస్తుంది. ఇక షో లో పార్టిసెపెంట్స్ పేర్లు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా మరో యాంకర్ పేరు కూడా వినిపిస్తుంది. కొన్నాళ్ళ క్రితం యాంకర్ రవితో కలిసి బుల్లితెరపై సందడి చేసిన లాస్య బిగ్ బాస్ 3లో పాల్గొనబోతుందని తెలుస్తుంది. ఇటివలే ఓ పాప జన్మనిచ్చిన లాస్య బిగ్ బాస్ 3తో తెలుగులో మళ్లీ బిజీ కావాలని చూస్తోందట.