బిగ్ బాస్ 3..వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇవ్వనున్న కుమారి21ఎఫ్

294
Hebba in Bigboss3
- Advertisement -

బిగ్ బాస్ 3 ప్రారంభమై 12రోజులు గడుస్తుంది. గత రెండు సీజన్ల కంటే ఈసీజన్ సక్సెస్ పుల్ రేటింగ్ తో దూసుకుపోతుంది. హోస్ మెట్స్ చేసే అల్లరి, హోస్ట్ నాగార్జున యాంకరింగ్ కే ప్రేక్షకులు ఫిదా అయిపోతున్నారు. ఈ కార్య‌క్ర‌మంపై మ‌రింత హైప్ తీసుకొచ్చేందుకు నిర్వాహ‌కులు ప‌లు క‌స‌ర‌త్తులు చేస్తున్నారు. గ‌త రెండు సీజ‌న్స్‌లో ఎలాంటి ప్ర‌యోగాలు చేయ‌ని టీం ఈ సారి ట్రాన్స్‌జెండ‌ర్‌ని బిగ్ బాస్ హౌజ్‌లోకి పంపింది. ఇక నేడు మరోక కంటెస్టెంట్ ఎలిమినెట్ కానున్నారు.

వరుణ్, వితిక, పునర్ణవి, జాఫర్ లు ఎలిమినేషన్ లో ఉన్నారు. అయితే ఈనలుగురిలో ఒకరు ఇవాళ బిగ్ బాస్ హౌజ్ ను విడిచి వెళ్లిపోనున్నారు. ఇక ఈవారం కూడా మరోక సెలబ్రెటీ వైల్డ్ కార్డ్ ద్వారా ఎంట్రీ ఇవ్వనున్నారు. ఫిలిం నగర్ వర్గాల సమాచారం ప్రకారం కుమారి 21ఎఫ్ తో తెలుగు ఇండస్ట్రీకి పరిచయమైన హెబ్బా పటేల్ బిగ్ బాస్ హౌజ్‌లోకి ఎంట్రీ ఇవ్వనున్న‌ట్టు తెలుస్తుంది. మరోవైపు రేయ్ సినిమాలో జెన్నాగా పవర్‌పుల్ ప్రతినాయిక పాత్రలో నటించి తన ఇమేజ్ అమాంతం పెంచేసుకున్న‌ యంగ్ హీరోయిన్ శ్ర‌ద్దాదాస్ కూడా బిగ్ బాస్ హౌజ్ లోకి రానున్నట్లు తెలుస్తుంది.

- Advertisement -