రంగమ్మత్త కాదు అక్కా అంటారుః అనసూయ

486
Anchor Anasuya
- Advertisement -

బుల్లితెరపై యాంకరింగ్ చేస్తూ అప్పుడప్పుడు సినిమాల్లో కూడా మెరుస్తుంది యాంకర్ అనసూయ. రంగస్థలం సినిమాలో రంగమ్మత్త క్యారెక్టర్‌తో అందర్నీ తన నటనతో అనసూయ మెప్పించింది. తాజాగా అనసూయ మీకుమాత్రమే చెప్తా సినిమాలో నటించింది. ఈమూవీని విజయ్ దేవరకొండ నిర్మించగా..దర్శకుడు తరుణ్ భాస్కర్ హీరోగా నటించారు.

ఈమూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఇటివలే హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ప్రోగ్రాంలో అనసూయ మాట్లాడుతూ…రంగమ్మత్త సినిమాలో నటించిన తర్వాత నన్ను అందరు రంగమ్మత్త అని పిలిచారని..కానీ ఈమీకు మాత్రమే చెప్తా సినిమా విడుదలైన తర్వాత నన్ను అందరూ అనసూయ అక్కా అని పిలుస్తారని చెప్పింది. మీకు అలా పిలవడానికి కొంచెం కష్టంగా ఉన్న నేను ఈసినిమాలో అక్క పాత్రలో చేశాను అని చెప్పింది అనసూయ. ఈసినిమా నవంబర్ 1న గ్రాండ్ గా విడుదల కానుంది.

- Advertisement -