ఎప్పుడూ ఫేస్‌బుక్‌లో హల్‌చల్ చేసే యాంకర్, నటి అనసూయ కొన్ని రోజులుగా ఫేస్‌బుక్‌లో అప్‌డేట్ లేదు. సడెన్‌గా ఆమె శనివారం లైవ్ చాట్ నిర్వహించారు. కొన్ని రోజులుగా ‘సచ్చిందిరా గొర్రె’ చిత్ర షూటింగ్ నిమిత్తం నైట్ షూటింగ్‌లో ఉండటం వల్లే ఫేస్‌బుక్ చాట్ లోకి రాలేకపోయానంటూ చెప్పిన ఆమె.. అందుకే ఇలా సడెన్‌గా లైవ్ చాట్‌తో అభిమానుల్ని సర్‌ప్రైజ్ చేయాలనే ఈ రోజు షూటింగ్ నుండి ముందుగానే వచ్చేసినట్లుగా ఆమె తెలిపారు.
అయితే ఈ చాట్ లో ఓ అభిమాని ఆమెకు ‘హాయ్ అనూ ఆంటీ..’ అని కామెంట్ పెట్టడం ఆమెను అసహనానికి గురిచేసింది. దీనిపై ఆమె ఘాటుగా స్పందిస్తూ.. ఆంటీ అనే పదాన్ని బూతు చేసేశారు. నా పిల్లల స్నేహితులు నన్ను ఆంటీ అంటే పలుకుతా.. కానీ గడ్డాలు మీసాలు పెంచుకుని నాకే అంకుల్ లా ఉన్న మీరు నన్ను ఆంటీ అని పిలవడమేంటి. కాస్త చదువుకున్న వారిలా ప్రవర్తించండి. ఆంటీ అనే పదాన్ని ఎక్కడ ఎవరితో వాడాలో వారితో వాడితేనే బాగుంటుంది అంటూ మండిపడింది అనసూయ.
ఇక మరో నెటిజన్ ఆమెను పెళ్లి చేసుకుంటానని ప్రపోజ్ చేశాడు. అనసూయా.. నన్ను రెండో పెళ్లి చేసుకో అని అడిగాడు. అందుకు ఆమె సమాధానమిస్తూ అస్సలు చేసుకోనని చెప్పేసింది. ఎన్ని జన్మలెత్తినా తన ప్రస్తుత భర్తనే మళ్లీ పెళ్లాడతానని కుండబద్దలు కొట్టి చెప్పింది. అలాగే తాను యాంకరింగ్ చేసే జబర్దస్త్ ప్రోగ్రాంను అందులోని నటులను వెనకేసుకొచ్చింది. బుల్లితెర బాహుబలి జబర్దస్త్ అంటూ అనసూయ ఆ షో గురించి తెగ బిల్డప్ ఇచ్చింది. ఈ షో తెలుగు టీవీ రంగాన్ని ఎక్కడికో తీసుకెళ్లిందని అనసూయ ఆంటీ చెప్పుకొచ్చింది.కాగా ఇటీవల జబర్దస్త్ నటుడు ఆది అనాథల గురించి చేసిన కామెంట్లపై ఆమె మాట్లాడుతూ ఆదిని వెనకేసుకొచ్చింది. ఆ కామెంట్లను సమర్థించనప్పటికీ ఏదో సరదా కోసం అన్నవి లైట్ తీస్కోండి అంటూ సర్దిచెప్పబోయింది.