ప్రముఖ తెలుగు యాంకర్ అనసూయ మళ్లీ షూటింగులకు రెడీ అయిపోయింది. ఈ సందర్భంగా అనసూయ ఫారెన్ అమ్మాయిలా కొత్త హెయిర్ స్టైల్‌తో కనపడుతోంది. న్యూ హెయిర్ స్టైల్‌తో దిగిన ఓ ఫోటోను అనసూయ తన ఇంస్టాగ్రామ్లో పోస్ట్ చేసింది. నా లుక్, నా మైండ్, నా ఆలోచనలు. నూతన ఉత్సాహంతో సరికొత్తగా మళ్లీ షూటింగ్‌లకు హాజరవుతున్నానని పోస్ట్ కింద రాసుకొచ్చింది. అయితే ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా ఈ లుక్‌పై నెటిజన్ల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది.. అనసూయ లుక్ చూసిన నెటిజన్లు వారివారి అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియచేస్తున్నారు.
తన కొత్త లుక్‌పై చేసిన కొన్ని మీమ్స్‌ను అనసూయ ఇన్స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేశారు. ఒక స్టోరీలో అనసూయ చూడటానికి జేమ్స్ బాండ్ హీరోయిన్లా ఉందని రాశారు. మరో స్టోరీలో పెట్టిన మీమ్‌లో ‘అనసూయనా.. నేను ఇంకా ఇంగ్లిష్ మూవీలో హీరోయిన్ అనుకున్నానే. మన తెలుగమ్మాయిలు, ఆడవారు తలచుకుంటే వారికంటే బాగుంటారు. మీరు సరిగ్గా దృష్టి సారించాలి అంతే’ అని రాసుంది. మొత్తం మీద తన న్యూ లుక్‌కి వస్తోన్న రెస్పాన్స్‌తో అనసూయ ఆనందం వ్యక్తం చేస్తోంది.