సందీప్ కిషన్ సిక్స్ ప్యాక్ లుక్

237
sundeep kishan
- Advertisement -

టాలీవుడ్ మ‌రో యంగ్ హీరో సిక్స్ ప్యాక్ క్లబ్ లో చేరారు. యువ హీరో సందీప్ కిష‌న్ త‌న కొత్త సినిమా కోసం సిక్స్ ప్యాక్ లో ద‌ర్శ‌న‌మిచ్చాడు. సిక్స్ ప్యాక్ బాడీకి సంబంధించిన ఫోటోలు సందీప్ సోషల్ మీడియాలో అభిమానుల‌తో పంచుకున్నాడు. సందీప్ సిక్స్ ప్యాక్ తో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సిక్స్ ప్యాక్ లుక్ లో సందీప్ కిష‌న్ అభిమానుల‌ను ఆక‌ట్టుకుంటున్నాడు.

ప్ర‌స్తుతం సందీప్ కిష‌న్ ఏ1 ఎక్స్ ప్రెస్ అనే సినిమాలో న‌టిస్తున్నాడు‌. ఈ మూవీ స్పోర్ట్స్ నేప‌థ్యంలో తెర‌కెక్క‌నుండ‌టంతో సందీప్ సిక్స్ ప్యాక్ చేశాడు. ఈ మూవీకి డెన్నిస్ జీవన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హ‌స్తున్నారు. సందీప్ కిష‌న్ కు జోడిగా లావ‌ణ్య త్రిపాఠి న‌టిస్తోంది. ఇప్ప‌టికే స‌గం వ‌ర‌కు చిత్రిక‌ర‌ణ పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వ‌ర‌లోనే మిగ‌తా షూటింగ్ ను ప్రారంభించ‌నున్నారు.

- Advertisement -