- Advertisement -
కార్తికేయ హీరోగా దర్శకుడు కౌశిక్ పెగళ్లపాటి డైరెక్షన్‌లో వస్తున్న ‘చావు కబురు చల్లగా’.ఈ చిత్రంలో లావణ్య త్రిపాఠి హీరోయిన్‌గా నటిస్తోంది. గీతా ఆర్ట్స్-2 బ్యానర్ పై బన్నీ వాసు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జేక్స్ బెజోయ్ సంగీతం అందిస్తున్నాడు. ఈ సినిమా అప్ డేట్లకు సినీ అభిమానుల నుంచి విశేషమైన స్పందన లభిస్తోంది. తాజాగా అనసూయ ఐటం సాంగ్ ప్రోమో కూడా అందరినీ ఆకట్టుకుంటోంది.
‘చావు కబురు చల్లగా’ చిత్రంలో యాంకర్ బ్యూటీ అనసూయ ఓ ఐటం సాంగ్ చేస్తున్న సంగతి తెలిసిందే. “పైన పటారం… లోన లొటారం” అంటూ సాగే ఆ గీతం తాలూకు ప్రోమో వీడియోను చిత్రం బృందం ఈ సాయంత్రం విడుదల చేసింది. పక్కా మాస్ తరహాలో ఉన్న ఈ పాటలో అనసూయ కుర్రకారును గిలిగింతలు పెట్టే విధంగా కనిపిస్తోంది. ప్రోమోలోనే ఇలావుంటే ఇక పూర్తి వీడియోలో ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.
- Advertisement -