జర్నలిస్టైన…రంగమ్మత్త..!

356
anasuya
- Advertisement -

అనసుయ భరద్వాజ్…ఓ వైపు యాంకర్‌గా మరోవైపు సినిమాల్లో హాట్ బ్యూటీగా సైడ్ క్యారెక్టర్లు చేస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. బుల్లితెర పాపులర్‌ షో జబర్దస్త్ ద్వారా ప్రేక్షకులకు మరింత చేరువైన అనసూయ గ్లామర్‌ పాత్రలతో సంబంధం లేకుండా ఎలాంటి చిన్న క్యారెక్టరైన చేస్తూ దూసుకుపోతోంది.

రామ్‌ చరణ్‌ రంగస్థలం సినిమాలో రంగమ్మత్తగా, వైఎస్ జీవిత చరిత్ర ఆధారంగా తెరకెక్కిన యాత్ర మూవీలో చిన్న పాత్ర చేసినా ప్రేక్షకులకు గుర్తుండిపోయే పాత్ర చేసి తనేంటో నిరూపించుకుంది. క్షణం మూవీ లో పోలీస్ ఆఫీసర్ పాత్రలో మెప్పించిన అనసూయ తాజాగా జర్నలిస్టు పాత్రలో కనిపించనుంది.

ప్రస్తుతం రాజేష్ నాదెండ్ల దర్శకత్వంలో ‘కథనం’ అనే సినిమా తెరకెక్కుతుండగా అనసూయ కీలకమైన జర్నలిస్టు పాత్రలో నటిస్తోంది. శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం టీజర్‌ని అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సినిమాలో శ్రీనివాస్ అవసరాల ,ధనరాజ్ కీలకపాత్రలో కనిపించనున్నారు. గాయత్రి ఫిలిమ్స్ బ్యానర్ ఈ సినిమాను నిర్మిస్తోంది. పాత్ర ఏదైనా సహజనటనతో మెప్పిస్తున్న అనసూయ జర్నలిస్టుగా అలరిస్తుందా లేదా వేచిచూడాలి.

- Advertisement -