బాలీవుడ్‌లోకి రంగమ్మత్త..!

351
anasuya
- Advertisement -

బుల్లితెరపై యాంకర్ గా తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది అనసూయ. ఆ తరువాత సినిమాల్లోనూ అవకాశాలు దక్కించుకుంటూ నటిగా తన సత్తా చాటుతోంది.రంగస్థలం సినిమాతో నటిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనసూయ…కథలో ప్రాధాన్యం కలిగిన పాత్రల్ని ఎంచుకుంటూ ముందుకుసాగుతోంది.

ప్రస్తుతం టాలీవుడ్‌లో పలు సినిమాలు చేస్తున్న ఈ బ్యూటీకి బాలీవుడ్ ఆఫర్ వచ్చిందని టీ టౌన్‌లో ప్రచారం జరుగుతోంది. అయితే అది సినిమాలో కాదు సీరియల్‌లో. హిందీలో టాప్ రేటెడ్ సీరియ‌ల్‌లో ఓ కీల‌క పాత్ర కోసం అన‌సూయ‌ను మేక‌ర్స్ సంప్ర‌దించారట.మరి ఈ వార్తలపై అనసూయ ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.

ప్రస్తుతం రానా హీరోగా తెరకెక్కుతున్న రంగమార్తాండలో కీ రోల్ పోషిస్తోంది అనసూయ. అంతేగాదు ఈ మూవీలో ఓ ఐటం సాంగ్‌లో అలరించనుందట.

- Advertisement -