అనసూయ భరద్వాజ్… యాంకర్ గా, నటిగా మనకు ఎంత సుపరిచితురాలో వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తూ.. వార్తల్లో నిలుస్తోందని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందం, అభినయంతో తనకంటూ గుర్తింపు తెచ్చుకుని వరుస అవకాశాలతో దూకుడుమీదున్న అనసూయ సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటారన్న సంగతి తెలిసిందే. నిత్యం ఫోటో షూట్లు, హాట్ కామెంట్స్ చేస్తూ నిత్యం వార్తల్లో నిలుస్తుంటారు.
తాజాగా సోషల్ మీడియాలో ఓ అభిమాని అడిగిన ప్రశ్నకి సమాధానం ఇచ్చారు అనసూయ.అక్కా మిమ్మల్ని ఎవరన్నా ఆంటీ అంటే ఎందుకు అంత కోపం వస్తుంది అని అడగగా.. అనసూయ సమాధానమిస్తూ.. ఎందుకంటే వాళ్ళ అర్దాలు వేరే ఉంటాయి కాబట్టి అని తెలిపింది.
అయినా ఇప్పుడు కోపం రావట్లేదు. అది వాళ్ళ కర్మకే వదిలేస్తున్నా. అలాంటి వాళ్ళని కరెక్ట్ చేయడం కంటే కూడా నాకు అంతకంటే ఇంపార్టెంట్, బెటర్ పనులు చాలా ఉన్నాయి అని సమాధానమిచ్చింది.
ఇవి కూడా చదవండి..