Dasara:వసూళ్లు ఎంతంటే?

41
dasara
- Advertisement -

నేచురల్ స్టార్ నాని హీరోగా శ్రీకాంత్ ఓదెలా దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం దసరా. నాని కెరీర్ లోనే మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం కావడంతో ఈ సినిమా పై భారీ అంచనాలుండగా ఆ అంచనాలకు తగ్గట్టుగానే దసరా విమర్శకుల ప్రశంసలను అందుకుంది. బాక్సాఫీస్‌ని షేక్ చేస్తూ మంచి వసూళ్లను రాబడుతోంది.

నాలుగురోజుల్లో నైజాంలో రూ.3.95 కోట్లు వసూలు చేయగా ఇప్పటివరకు రూ.18.3 కోట్లు రాబట్టింది. ఇక ఓవర్‌సీస్‌లోనూ మంచి వసూళ్లను రాబట్టింది ఈ చిత్రం. అన్ని భాషల్లోనూ మంచి ఆదరణ లభిస్తోంది. దీంతో రానున్న రోజుల్లో వసూళ్లు మరింత పెరిగే అవకాశం ఉంది.

దీక్షిత్ శెట్టి,పూర్ణ,సముద్రఖని,సాయి కుమార్ ప్రధాన పాత్రలో నటించగా ఎస్‌ల్వీ సినిమాస్ నిర్మించింది. సంతోష్ నారాయణ్ సంగీతం అందించారు. నాని, కీర్తి సురేశ్‌ నటన సినిమాకే హైలైట్‌గా నిలిచింది.

ఇవి కూడా చదవండి..

- Advertisement -