ఇస్మార్ట్ శంకర్ వంటి బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత పూరి జగన్నాథ్ విజయ్ దేవరకొండతో సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇటీవలె షూటింగ్ ప్రారంభమైన ఈ చిత్రం ఫస్ట్ షెడ్యూల్‌ని కూడా పూర్తి చేసుకుంది. తొలి షెడ్యూల్లో విజయ్, రమ్యకృష్ణకు సంబంధించిన ఎపిసోడ్‌ని పూర్తిచేశారు పూరి.
తాజాగా ఈ సినిమాకు సంబంధించి మరో అప్డేట్ వచ్చేసింది. ఈ సినిమాలో విజయ్ సరసన బాలీవుడ్ నటి అనన్య పాండే హీరోయిన్గా నటించనుందట. త్వరలోనే పూరి ఇందుకు సంబంధించిన అనౌన్స్మెంట్ ఇవ్వనున్నారట.
వాలెంటైన్స్ డే ఫిబ్రవరి 14 నుండి సెకండ్ షెడ్యూల్ ప్రారంభంకానుండగా ఈ షెడ్యూల్లో అనన్య చిత్రయూనిట్‌తో జాయిన్కానుందట. విజయ్‌కి తల్లిగా రమ్యకృష్ణ నటిస్తోంది. పూరి స్క్రిప్టుకు ఫిదా అయిన కరణ్ జోహార్, అపూర్వ మెహతా నిర్మాణ భాగస్వాములుగా ఈ ప్రాజెక్టులో జాయిన్ అయ్యారు.
పాన్ ఇండియా మూవీగా హిందీతో పాటు, అన్ని దక్షిణాది భాషల్లోనూ ఇది రూపొందుతోంది. ఈ సినిమాలో విజయ్ దేవరకొండ లుక్ విషయంలో పూరి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు.