ముంబై దాడుల సూత్రధారికి ఐదేళ్ల జైలు శిక్ష..

449
Hafiz Saeed
- Advertisement -

2008లో ముంబై దాడులకు ప్రధాన సూత్రధారి అయిన మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు హఫీజ్ సయీద్‌కు జైలు శిక్ష పడింది. అయితే అది భారత్‌లో కాదు దాయాది దేశమైన పాకిస్థాన్‌లో ఇది జరిగింది. పాక్‌లోని యాంటీ టెర్రరిజం కోర్టు సయీద్‌కు ఐదేళ్ల శిక్షను విధించింది. టెర్రరిజానికి సంబంధించిన రెండు కేసుల్లో ఈ శిక్షను విధించింది.

పాకిస్థాన్‌ను బ్లాక్ లిస్టులో పెట్టే యోచనలో ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఆలోచిస్తున్న తరుణంలోనే ఈ తీర్పు రావడం గమనార్హం. డిసెంబర్ నుంచి రోజు వారీగా ఈ కేసులో విచారణ చేపడుతున్న కోర్టు… సయీద్‌కు శిక్ష విధించింది. 26/11 ముంబై దాడులకు హఫీజ్ సయీద్‌ ప్రధాన సూత్రధారి. ఈ దాడుల్లో మొత్తం 166 మంది దుర్మరణం పాలయ్యారు.

ఈ ఉగ్రవాదిపై పాక్‌లో 23 టెర్రర్ కేసులు ఉన్నాయి. హఫీజ్ సయీద్‌పై భారత్ ఆరోపణలు గుప్పిస్తున్నప్పటికీ పాక్‌ వినిపించుకోలేదు. దేశమంతా స్వేచ్ఛగా తిరుగుతూ భారత్‌కు వ్యతిరేకంగా విద్వేషపూరిత ప్రసంగాలు చేసినా పాక్‌ పట్టించుకోలేదు. అయితే, ఇటీవలి కాలంలో పాక్‌పై అంతర్జాతీయంగా ఒత్తిడి పెరిగిన నేపథ్యంలో, కోర్టు నుంచి ఈ తీర్పు వెలువడటం గమనార్హం.

- Advertisement -