ప్రాణాయామంతో సంపూర్ణ ఆరోగ్యం: మంత్రి హరీష్

462
harishrao
- Advertisement -

ప్రాణాయామంతో ఆరోగ్యవంతులు కావాలని పిలుపునిచ్చారు మంత్రి హరీష్ రావు. సంగారెడ్డి పట్టణంలో యోగా శిబిరాన్ని ప్రారంభించిన అనంతరం మాట్లాడిన ఆయన ప్రాణాయామం చేసిన వ్యక్తులు వందేళ్లు జీవిస్తారని చెప్పారు. సాధారణంగా ప్రతి మనిషి నిమిషానికి 20 నుంచి 25 సార్లు శ్వాస తీసుకుంటారు కానీ ప్రాణాయామం బాగా చేసే వారు 12 నుంచి 15 సార్లు మాత్రమే శ్వాస తీసుకుంటారన్నారు.

ఏనుగు నిమిషానికి 9 నుంచి 10 సార్లు శ్వాస తీసుకుని 150 ఏళ్లు జీవిస్తుంది. తాబేలు నిమిషానికి 4 నుంచి 5 సార్లు శ్వాస తీసుకుని 300 నుంచి 400 ఏళ్లు బ్రతుకుతుంది. అదే కుక్క నిమిషానికి 40 నుంచి 50 సార్లు శ్వాస తీసుకుంటుంది. దీనివల్ల 15 ఏళ్ల కన్నా ఎక్కువ బ్రతకదన్నారు.

రోగం వస్తేనే డాక్టర్‌ వద్దకు వెళుతున్నాం. డాక్టర్‌ చెబితేనే ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహిస్తున్నాం. ఇది సరైంది కాదు. ప్రతీ ఒక్కరూ తమ ఆరోగ్యం విషయంలో చేయిదాటక ముందే జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.

ఓ గంట ప్రాణాయామం చేస్తే డాక్టర్‌ అవసరం లేదన్నారు. ఆహారం మితంగా తినాలి. ఆహారమే ఔషదంగా తీసుకోవాలి. లేదంటే ఔషదమే ఆహారంగా మారుతుందన్నారు.

- Advertisement -