బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న వారిపై పోలీసులు కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించింది హీరోయిన్ అనన్య నాగళ్ల. బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేయగా బెట్టింగ్ యాప్స్ ప్రభుత్వమే ప్రమోట్ చేస్తుంటే మాకేలా తెలుస్తుంది అంటూ ప్రశ్నించింది.
ఈ సందర్భంగా హైదరాబాద్ మెట్రో ప్రమోట్ చేస్తున్న వన్ ఎక్స్ బెట్టింగ్(1X Betting App) యాప్ ఫొటోను షేర్ చేస్తు ప్రశ్నించగా ప్రభుత్వానికి చెందిన సంస్థ (హైదరాబాద్ మెట్రో) బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేస్తుంటే అవి చట్టవిరుద్ధంగా ప్రమోట్ చేయబడుతున్నాయని మనం ఎలా తెలుసుకోవాలి అంటూ అనన్య ఇన్‌స్టాలో రాసుకోచ్చింది.
మరోవైపు తాను బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసినందుకు క్షమాపణలు తెలిపింది అనన్య. దయచేసి నన్ను క్షమించండి. నేను తెలిసి తప్పు చేయలేదు. అందరూ టాప్ సెలబ్రిటీలు చేస్తున్నారు కాబట్టి తప్పు కాదని అనుకున్నాను. ఇప్పటినుంచి చాలా జాగ్రత్తగా బాధ్యతగా ఉంటాను అని చెప్పుకొచ్చింది.
నటులు రానా దగ్గుబాటితో పాటు ప్రకాశ్ రాజ్, విజయ్ దేవరకొండ అనన్య నాగళ్ల, సిరి హనుమంతు, శ్రీముఖి, శోభా శెట్టి తదితర నటులపై కేసు నమోదు చేశారు.
Also Read:ట్రంప్ మరో సంచలన నిర్ణయం