దొరసాని..లిప్ లాక్ లేని లవ్ స్టోరీ..!

446
dorasani movie
- Advertisement -

ఎనర్జిట్ హీరో విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ దేవరకొండ హీరోగా డా.రాజశేఖర్ కుమార్తె శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్‌గా పరిచయం అవుతున్న చిత్రం ‘దొరసాని’. కేవీఆర్ మహేంద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ జూలై 12న విడుదల కానుంది.

సినిమా ప్రమోషన్‌లో భాగంగా ఆసక్తికర విషయాలను వెల్లడించారు ఆనంద్ దేవరకొండ. లవ్ స్టోరీ అన్నంత మాత్రాన తన మూవీలో లిప్ లాక్‌ సీన్స్ అసలే ఉండవని చెప్పేశారు. 1980లో జరిగే ఒక పీరియాడిక్ లవ్ స్టోరీ అని స్పష్టం చేశారు.

రాజు-దొరసాని మధ్య జరిగిన ప్రేమకథని ..తమ కథలోని స్వచ్ఛత,నిజాయితీ ఈ లవ్ స్టోరీని ముందుకు నడిపిస్తాయన్నారు. ప్రేక్షకులకు ఈ మూవీ 100 శాతం నచ్చుతుందని కుండబద్దలు కొట్టారు. రియల్ లొకేషన్స్‌లోనే సినిమా షూట్ చేశామని చెప్పారు. టీజర్,ట్రైలర్‌లతోనే అంచనాలు పెంచేసిన దొరసాని మూవీ విడుదల తర్వాత ఏ మేరకు ఆకట్టుకుందో వేచిచూడాలి.

- Advertisement -