రూట్‌ మార్చిన బ్రిటీష్‌ బ్యూటీ..

352
Amy Jackson turns producer with a short film
- Advertisement -

సినిమా ఇండస్ట్రీలో హీరోలుగా, హీరోయిన్లుగా ఎంట్రీ ఇచ్చినవారు చివరి వరకూ అదే రోల్స్‌ని ప్లే చెయ్యలేకపోతున్నారు. ఫైట్లతో డాన్స్‌లతో ప్యాన్స్‌కి కిక్కిచ్చిన హీరోలు ఎప్పుడు ఏ అవతారం ఎత్తుతారో తెలియట్లేదు.

అయితే.. ఇప్పుడు అందాలతో ఆడియెన్స్‌ కి మత్తెక్కించిన హాట్‌ భామలు కూడా హీరోలనే ఫాలో అవుతున్నారేమో అనిపిస్తోంది. మరి వారికి ఆఫర్లు రావడంలేదా? లేక నటించడం బోర్‌ కొడుతోందా అనేది మాత్రం అర్థంకావట్లేదు. ఇంతకీ చెప్పొచ్చేదేంటంటే..సినిమాలు తియ్యడానికి తహతహలాడుతూ..మంచి కథ దొరికితే మేం రెడీ.. అనే  నిర్మాతలు ఇప్పటికే క్యూలో ఉన్నారు.
 Amy Jackson turns producer with a short film
అయితే..ఇప్పటివరకూ హీరోలుగా, హీరోయిన్లుగా వారి వారి రోల్స్‌ ని ప్లే చేస్తూ వస్తున్న వీరు కొత్త అవతారాల్లోకి చేంజ్‌ అవుతున్నారు. ఆ అవతావమే నిర్మాత గా ముందుకు రావడం. ఇప్పటికే కొంతమంది హీరోలు నిర్మాతలుగా మారారు. అయితే హీరోయిన్‌గా వరుస అవకాశాలను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్న అమీ జాక్సన్‌ కూడా ఇప్పుడు ఇదే అవతారం ఎత్తబోతోంది.

అంటే…త్వరలో ఈ అమ్మడు నిర్మాతగా మారబోతోంది. ఇక ఈ హాట్‌ బ్యూటీ నిర్మాతగా మారబోతోంది అని తెలియగానే సినీ లవర్స్‌  అమీ గురించే తెగ చర్చించుకుంటున్నారు. ఎందుకంటే..ఈ అమ్మడు నిర్మాతగా మారి ఏ భాష సినిమా చేయబోతోంది? అందులో ఎవరు నటించబోతున్నారు? ఆ సినిమాకు దర్శకత్వం ఎవరు వహించనున్నారు అనే క్యూరియాసిటి వారిలో మొదలైంది.
 Amy Jackson turns producer with a short film
అయితే ఈ అమ్మడు నిర్మాతగా మారుతోంది అంటే..అందరూ అనుకున్నట్టు పెద్ద సినిమాలకు కాదండోయ్‌. ఓ లఘు చిత్రానికి. అమీ జాక్సన్‌ ఓ లఘు చిత్రంతో నిర్మాతగా మారబోతుంది.

మూగజీవాల వధను నిలువరించే విధంగా ఒక అవగాహన కల్పించే లఘు చిత్రాన్ని ఆమె నిర్మించనున్నట్లు వెల్లడించింది. అయితే అందులో తాను నటించనని కూడా చెప్పేసింది. త్వరలోనే ఈ లఘు చిత్రాన్ని తెరకెక్కించి విడుదల చేయాలని అనుకుంటున్నట్లు అమీ జాక్సన్‌ తెలిపింది. మరి అమీ తీసుకున్న ఈ నిర్ణయం ఎంత వరకు తనని నిర్మాతగా నిలబెడుతుందో చూడాలి.

- Advertisement -