మిషన్ చాప్టర్ 1..రిలీజ్ డేట్ ఫిక్స్

29
- Advertisement -

2.0, పొన్నియిన్ సెల్వన్ వంటి సినిమాలను నిర్మించి అందరి మన్ననలు అందుకుని ఇప్పుడు ఇండియన్ 2, రజినీకాంత్ 170 చిత్రాలతో ఆడియెన్స్‌ని వావ్ అనిపించటానికి సిద్ధమవుతోన్న నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. భారీ బడ్జెట్ సినిమాలనే కాదు, డిఫరెంట్ కంటెంట్ చిత్రాలను కూడా పేక్షకులకు అందించటానికి లైకా సంస్థ ఎప్పుడూ ప్రయత్నిస్తూనే ఉంటుంది. ఆ కోవలో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌ నుంచి రాబోతున్న మరో డిఫరెంట్ మూవీ ‘మిషన్ చాప్టర్ 1’.

అరుణ్ విజయ్, ఎమీ జాక్సన్, నిమిషా సజయన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ఈ చిత్రంలో అబి హాస‌న్‌, భ‌ర‌త్ బొప‌న్న‌, బేబి ఇయ‌ల్‌ ప్రధాన పాత్రల్లో మెప్పించనున్నారు. టాలెంటెడ్ డైరెక్టర్ విజయ్ తెరకెక్కిస్తోన్న ఈ చిత్రానికి ఎం.రాజ‌శేఖ‌ర్‌, ఎస్‌.స్వాతి నిర్మాత‌లు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.

లైకా ప్రొడ‌క్ష‌న్స్‌. కోలీవుడ్ హీరో అరుణ్ విజ‌య్ హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ భారీ బ‌డ్జెట్ మూవీ ‘మిషన్: చాప్ట‌ర్ 1’ తాజాగా లైకా ప్రొడక్ష‌న్స్ నుంచి రాబోతున్న‌క్రేజీ చిత్రాల సినిమాల లిస్టులో చేరింది. ఈ చిత్రానికి ఎం.రాజ‌శేఖ‌ర్‌, ఎస్‌.స్వాతి నిర్మాత‌లు. చిత్రాన్ని కేవ‌లం 70 రోజుల్లో లండ‌న్‌, చెన్నై స‌హా ప‌లు లొకేష‌న్స్‌లో శ‌ర‌వేగంగా చిత్రీక‌రించటం గొప్ప విష‌యం.

2.0లో న‌టించి అలరించిన ముద్దుగుమ్మ‌ ఎమీ జాక్స‌న్ ‘మిషన్ చాప్టర్ 1’ చిత్రంతో రీ ఎంట్రీ ఇస్తున్నారు. ఇందులో ఆమె జైలర్ పాత్రలో మెప్పించబోతున్నారు. మ‌ల‌యాళ చిత్ర ప‌రిశ్ర‌మ‌కు చెందిన విల‌క్ష‌ణ న‌టి నిమిషా స‌జ‌య‌న్ ఈ మూవీలో ఓ కీల‌క పాత్ర‌ను పోషించారు. జి.వి.ప్ర‌కాష్ ఈ చిత్రానికి సంగీత సార‌థ్యాన్ని వ‌హిస్తున్నారు. సినిమాను నాలుగు భాషల్లో రిలీజ్ చేయబోతున్నారు.

Also Read:శ్రీశైలంలో భారీగా ట్రాఫిక్ జామ్

- Advertisement -