తమిళ సూపర్ స్టార్ రజనీ కాంత్ – సౌత్ ఇండియన్ క్రేజీ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్లో వచ్చిన రోబో సినిమా ఎన్నో రికార్డులు క్రియేట్ చేయడంతో పాటు అటు రజనీ, ఇటు శంకర్ వీరిద్దరి కేరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. 2010లో వచ్చిన ఈ సినిమాకు కంటిన్యూగా ఇప్పుడు 2.0 తెరకెక్కుతోంది. ఈ సినిమా ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకోగా, ప్రస్తుతం సీజీ వర్క్స్ జరుపుకుంటుంది. అక్టోబర్ 2017లో ఈ చిత్రాన్ని విడుదల చేయాలని యూనిట్ భావించినప్పటికి, కొన్ని కారణాల వలన 2018కి వాయిదా వేశారు.
అయితే తాజాగా ఈ చిత్రానికి సంబంధించి రెండు పిక్స్ లీక్ కాగా, అవి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. సూపర్ స్టార్ రజనీకాంత్ గొడని నెడుతున్నట్టు ఉండగా, మరో ఫోటోలో అమీ జాక్సన్ హెవీ వైకిల్ ని నడుపుతున్నట్టుగా ఉంది. ఈ పిక్స్ అంతగా క్లారిటీ లేకపోయిన, ఫ్యాన్స్ లో మాత్రం అంచనాలు పెంచుతున్నాయి.
రజనీకాంత్‌కున్న క్రేజ్‌ను దృష్టిలో పెట్టుకొని జపనీస్, చైనీస్, కొరియన్తో పాటు వివిధ విదేశీ భాషల్లో ప్రపంచ వ్యాప్తంగా ఏడువేల థియేటర్స్ లో విడుదల చేయాలనుకుంటున్నారు రోబో టీం. 450 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తోన్న ఈ సినిమాపై భారీ అంచానాలు వున్నాయి. బాహుబలి-2 రికార్డులను బ్రేక్ చేయాలనే లక్ష్యంతో చిత్ర దర్శకనిర్మాతలు పావులు కదుపుతున్నారని తమిళ సినీ వర్గాల్లో వినిపిస్తున్నది. ఈ చిత్రంలో బాలీవుడ్ నటుడు అక్షయ్‌కుమార్ ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని జనవరి 25,2018న విడుదల చేయనున్నారు. అమీ జాక్సన్ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని లైకా ప్రొడక్షన్స్ వారు భారీగా నిర్మిస్తుండగా, ఏఆర్ రెహ్మాన్ మ్యూజిక్ అందిస్తున్నారు.